RRR Movie Review : ఆర్ఆర్ఆర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR Movie Review : ఆర్ఆర్ఆర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

 Authored By aruna | The Telugu News | Updated on :24 March 2022,11:37 pm

RRR Movie Review అసలు ఎప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా.. ఎప్పుడు రిలీజ్ అవుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తన సమయాన్ని పూర్తిగా ఆర్ఆర్ఆర్ సినిమా RRR Movie Review కోసమే వెచ్చించారు. ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. బాహుబలి 2 రిలీజ్ అయిన 2017 నుంచి 2022 వరకు అంటే దాదాపుగా 5 ఏళ్ల పాటు ఒకే ఒక్క సినిమా కోసం పని చేశారు రాజమౌళి.అయితే.. బాహుబలి సిరీస్ కు వచ్చిన క్రేజ్ కంటే ఎక్కువ క్రేజ్ ఈ సినిమాకు వచ్చింది.

ముందుగా ఈ సినిమాను 2020లోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా.. కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడటం.. ఆ తర్వాత మరికొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ సినిమాకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడం. అలాగే తొలి సారి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.. సౌత్ సినిమాలో నటించడం.. అజయ్ దేవగణ్ లాంటి మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో నటించాడు.

RRR movie review and live updates

RRR movie review and live updates

RRR Movie Review : సినిమా పేరు : ఆర్ఆర్ఆర్
నటీనటులు : రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్
డైరెక్టర్ : ఎస్ఎస్ రాజమౌళి
ప్రొడ్యూసర్ : డీవీవీ దానయ్య
మ్యూజిక్ డైరెక్టర్ : ఎంఎం కీరవాణి
రన్ టైమ్ : 3 గంటల 2 నిమిషాలు
రిలీజ్ డేట్ : 25 మార్చి 2022

RRR Movie Review  : ఆర్ఆర్ఆర్ మూవీ అప్ డేట్స్

చరిత్రలో ఏనాడూ కలుసుకోని ఇద్దరు వీరులు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించి ఈ కథను విజయేంద్రప్రసాద్ రాశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న రిలీజ్ అవబోతోంది. అయితే.. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. మరి.. యూఎస్ ప్రీమియర్స్ ప్రకారం.. సినిమా లైవ్ అప్ డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా ప్రారంభం అవడమే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం అవుతుంది. అవి స్వాతంత్ర్యం రాకముందు రోజులు. బ్రిటీషర్స్ భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు. ఓ బ్రిటీష్ ఆఫీసరు.. ఆదిలాబాద్ కు చెందిన ఓ గోండు అమ్మాయిని ఎత్తుకెళ్తాడు. తన బిడ్డను ఎత్తుకెళ్లొద్దని కోరిన బాలిక తల్లిని ఆ ఆఫీసరు చంపేస్తాడు.మరోవైపు రామ్ చరణ్.. బ్రిటీష్ రాజ్యంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు.

జూనియర్ ఎన్టీఆర్(అక్తర్) ఢిల్లీ వెళ్తాడు. ఆ బాలికను కాపాడటం కోసం వెళ్తాడు. చరణ్ కంటే.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ బాగుంది. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్లు పూర్తవుతాయి. ఇద్దరూ బాగా నటించారు. అయితే.. రామ్ చరణ్ ఇంట్రో అంతగా ఆసక్తికరంగా లేదు.

బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగే వాళ్లను.. ఎవరు బ్రిటీషర్లు ఎదురు తిరిగినా.. వాళ్లను బ్రిటిషర్ల ముందు నిలబెట్టడమే చరణ్ డ్యూటీ. అటువంటి వాళ్లను వెతుక్కుంటూ న్యూఢిల్లీ వెళ్తాడు చరణ్. ఆదిలాబాద్ నుంచి తీసుకొచ్చిన బాలికను దాచిన ప్యాలెస్ లోనే ఒలివా కూడా నివసిస్తుంది. ఆ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యేందుకు.. ఒలివా తోటి ఫ్రెండ్ షిప్ చేసేందుకు ఎన్టీఆర్ తెగ ప్రయత్నిస్తాడు. 1920 దశకంలో ఢిల్లీ ఎలా ఉంటుందో.. అలా జక్కన్న కళ్లకు కట్టినట్టు చూపించాడు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసే సమయం వచ్చేసింది. మంటల్లో చిక్కుకున్న ఓ బాలుడిని కాపాడేందుకు ఎన్టీఆర్, చరణ్.. ఇద్దరూ రంగంలోకి దిగుతారు.

ఆ బాలుడిని కాపాడిన తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒలివియాకు దగ్గరవడం కోసం తనతో ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ చేయడం కోసం చరణ్ సాయం చేస్తాడు. ఒలివియా, ఎన్టీఆర్ మధ్య లవ్ సీన్స్ వస్తాయి. అమాయకుడిగా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఒలివియా ద్వారా ఎన్టీఆర్ ప్యాలెస్ లో అడుగుపెడతాడు. ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు వస్తాయి. నాటు నాటు సాంగ్ వస్తుంది. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కుమ్మేశారు.

RRR Movie Review  ఫస్ట్ హాఫ్ రిపోర్ట్

నాటు నాటు సాంగ్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కువగా హీరోల ఇంట్రడక్షన్ మీదనే జక్కన్న దృష్టి పెట్టాడు. ఇంటర్వల్ బ్లాక్ అయితే అదిరిపోతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇద్దరూ ఏమాత్రం తగ్గలేదు. ఒకరిని మించి మరొకరు నటించారు. ఇద్దరికీ సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది. దోస్తీ, నాటు నాటు సాంగ్స్ అదిరిపోయాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే అజయ్ దేవగణ్, శ్రియ క్యారెక్టర్లతో స్టార్ట్ అవుతుంది. చరణ్ పిల్లాడిగా ఉన్నప్పటి స్టోరీ ప్రారంభం అవుతుంది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఎమోషనల్ ఎపిసోడ్ వస్తుంది. ఈ సినిమాకు ఆ సీక్వెన్సే హైలైట్. ఆ తర్వాత కొమరం బీముడో అనే పాట ప్రసారం అవుతుంది. ఆ పాట బాగుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ మధ్య కొన్ని గొప్ప సీన్స్ వస్తాయి. ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ కు ఉర్రూతలూగాల్సిందే.

RRR Movie Review ఫైనల్ రిపోర్ట్

ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. మొత్తినికి సినిమా బాగుంది. సినిమాటిక్ గా సినిమాలో అన్నీ బెటర్ సీన్స్ ను రాజమౌళి పెట్టాడు. సినిమాలోని ప్రతి సీన్ అద్భుతమైందే. ముఖ్యంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది