Sai Pallavi Gargi Review : సాయి పల్లవి గార్గి రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sai Pallavi Gargi Review : సాయి పల్లవి గార్గి రివ్యూ అండ్ రేటింగ్

Sai Pallavi Gargi Review : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తాజాగా నటించిన మూవీ గార్గి. ఈ సినిమా తమిళం మూవీ. కానీ.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. తన తండ్రి కోసం ఒక కుమార్తె ఎలాంటి న్యాయ పోరాటం చేసిందే చెప్పేదే ఈ సినిమా. ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి సమర్పించగా.. తమిళంలో సూర్య, జ్యోతిక సమర్పించారు. నిజానికి.. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ కూడా […]

 Authored By gatla | The Telugu News | Updated on :15 July 2022,7:30 am

Sai Pallavi Gargi Review : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తాజాగా నటించిన మూవీ గార్గి. ఈ సినిమా తమిళం మూవీ. కానీ.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. తన తండ్రి కోసం ఒక కుమార్తె ఎలాంటి న్యాయ పోరాటం చేసిందే చెప్పేదే ఈ సినిమా. ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి సమర్పించగా.. తమిళంలో సూర్య, జ్యోతిక సమర్పించారు. నిజానికి.. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అసలు.. సాయి పల్లవి విరాట పర్వం తర్వాత గార్గి అనే సినిమాలో నటిస్తోందని చాలామందికి తెలియదు. ఎలాంటి హడావుడి లేకుండా.. ఈ సినిమాను చాలా సింపుల్ గా మూడు భాషల్లో విడుదల చేశారు. అసలు ఈ గార్గి సినిమా కథ ఏంటి? సాయి పల్లవి ఎలా నటించింది. విరాట పర్వం తర్వాత మళ్లీ ప్రధాన పాత్రలో నటించిన సాయి పల్లవి తన పాత్రకు న్యాయం చేసిందా లేదా? తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

sai pallavi garg telugu movie review and rating

sai pallavi garg telugu movie review and rating

Sai Pallavi Gargi Review : కథ

సినిమా కథ ఏంటంటే.. సాయి పల్లవి(గార్గి) ఒక సాధారణ స్కూల్ టీచర్. తన తండ్రి బ్రహ్మానందం(ఆర్ఎస్ శివాజీ) ఒక అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తుంటాడు. ప్రతి రోజు రాత్రి కాగానే ఇంటికి వచ్చే తన తండ్రి ఒక రోజు ఇంటికి రాకపోవడంతో అపార్ట్ మెంట్ కు వెళ్తుంది గార్గి. కానీ.. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. బాలికపై అత్యాచారం చేశాడనే నెపంతో తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలిసి గార్గి షాక్ అవుతుంది. నిజానికి ఎవరో కొందరు వ్యక్తులు తొమ్మిదేళ్ల బాలికపై అపార్ట్ మెంట్ లో అత్యాచారం చేస్తారు. కానీ.. బ్రహ్మానందం మీద అనుమానంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దీంతో తన తండ్రిని విడిపించుకునేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది గార్గి. తనకు లాయర్ గిరీషం(కాళి వెంకట్ ) సాయం చేస్తాడు. తన తండ్రి నిర్దోషిగా విడుదల అవుతాడా? అసలు తన తండ్రి నిజంగా తప్పు చేయలేదా? చివర్లో వచ్చే ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ

ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మహిళలపై వేధింపులు. దాన్నే ప్రధాన అంశంగా తీసుకొని డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విరాట పర్వంతో తనేంటో నిరుపించుకుంది సాయి పల్లవి. తను ప్రధాన పాత్రలో సినిమా వస్తుందంటే.. ఆ సినిమాను మొత్తం సాయి పల్లవే మోయాల్సి ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే జరిగింది. తన తండ్రిని కాపాడుకునేందుకు సాయి పల్లవి పడిన పాట్లు, న్యాయం కోసం తను పోరాడిన తీరును దర్శకుడు బాగా మలిచాడు. చాలా చిన్న కథే కానీ.. కథను అర్థం చేసుకుంటే దానిలోని సందేశం చాలా పెద్దది. గార్గి పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. ఆ తర్వాత లాయర్ పాత్రలో కాళి వెంకట్.. సాయి పల్లవి తండ్రిగా నటించిన శివాజీ, జడ్జి పాత్రలో ట్రాన్స్ జెండర్, ఇతర పాత్రలు కూడా బాగా నటించారు.

Sai Pallavi Gargi Review : సినిమా పేరు : గార్గి

నటీనటులు : సాయి పల్లవి, ఆర్ ఎస్ శివాజీ, కాళి వెంకట్, ఐశ్వర్యలక్ష్మి తదితరులు

డైరెక్టర్ : గౌతమ్ రామచంద్రన్

సంగీతం : గోవింద్ వసంత్

సినిమాటోగ్రఫీ : ప్రేమ్ కృష్ణ

సమర్పణ(తెలుగు) : రానా దగ్గుబాటి

నిర్మాతలు : రవిచంద్రన్, రామచంద్రన్, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మి

రన్నింగ్ టైమ్ : 2 గంటల 17 నిమిషాలు

కన్ క్లూజన్

చివరగా ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామా అనుకోవచ్చు. రొడ్డు కొట్టుడు సినిమాలు కాకుండా.. కొత్త కంటెంట్ కావాలనుకునే వాళ్లు.. సింపుల్ గా .. నాచురల్ గా సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు ఈ సినిమాను ఏంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

ది తెలుగు న్యూస్ రేటింగ్ : 3.25/5

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది