Saindhav Movie Review : సైంధవ్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Saindhav Movie Review : సైంధవ్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Saindhav Movie Review : సైంధవ్ మూవీ రివ్యూ | వెంకటేష్ సైంధవ్ రివ్యూ | Saindhav Movie Twitter Review | సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ ‘ సైంధవ్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది వెంకీ కి 75వ సినిమా కావడం విశేషం. దాంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తర్వాత వెంకటేష్ చేస్తున్న యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాకి శైలేష్ కొలను రచన, దర్శకత్వం అందించారు. […]

 Authored By anusha | The Telugu News | Updated on :12 January 2024,9:46 pm

ప్రధానాంశాలు:

  •  Saindhav Movie Review : సైంధవ్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

  •  Venkatesh Saindhav Movie Review Rating in Telugu

Cast & Crew

  • Hero : వెంకటేష్
  • Heroine : రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా,
  • Cast : రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ
  • Director : శైలేష్ కొలను
  • Producer : వెంకట్‌ బోయనపల్లి
  • Music : సంతోష్ నారాయణన్
  • Cinematography : ఎస్. మణికందన్

Saindhav Movie Review : సైంధవ్ మూవీ రివ్యూ | వెంకటేష్ సైంధవ్ రివ్యూ | Saindhav Movie Twitter Review | సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ ‘ సైంధవ్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది వెంకీ కి 75వ సినిమా కావడం విశేషం. దాంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తర్వాత వెంకటేష్ చేస్తున్న యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాకి శైలేష్ కొలను రచన, దర్శకత్వం అందించారు. హిట్, హిట్ 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శైలేష్ కొలను . నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మించారు. శ్రద్ధ శ్రీనాథ్ , రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజద్దీన్ సిద్ధికి ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. సంక్రాంతికి రాబోతుండడంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. దానికి తోడు ఈ సినిమా బిజినెస్ కూడా అలానే జరిగింది . వెంకీ గత సినిమాల నెంబర్లను కూడా బ్రేక్ చేసింది. యూఎస్ఏ లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. రేపు భారతదేశంలో విడుదల కానుంది. అమెరికా ప్రేక్షకులు సైంధవ్ సినిమాను ఎలా ఉందో చెప్పారు. వెంకటేష్ కి మంచి హిట్ దక్కిందా.. నవాజద్దీన్ సిద్ధికి క్యారెక్టర్ ఈ సినిమాకి ఏమైనా హెల్ప్ అయిందా..? శైలేష్ కొలను డైరెక్షన్ ఎలా ఉంది అనేది తెలియజేశారు.

Saindhav Movie Review : సైంధవ్ మూవీ రివ్యూ – కథ :

సైకో పర్సన్ అయిన సైంధవ్ ( వెంకటేష్ ) మనోజ్ఞ ( శ్రద్ధ శ్రీనాథ్ ) దంపతులకు గాయత్రి అనే ఒక పాప ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి చాలా సంతోషంగా ఫ్యామిలీని గడుపుతారు. అయితే ఆ సమయంలో పాపకి ఒక వ్యాధి సోకుతుంది. దాంతో ఆ పాపకి ఆ వ్యాధి క్యూర్ అవ్వడానికి 17 కోట్లు పెట్టి ఒక ఇంజక్షన్ చేయించాల్సి ఉంటుంది. ఇక దానికోసం వెంకటేష్ విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ చాలా తాపత్రయ పడుతుంటాడు. అయితే మిడిల్ క్లాస్ లైఫ్ ని అనుభవిస్తున్న వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. దాంతో ఇంజక్షన్ వేయించడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇది ఇలా ఉంటే వెంకటేష్ కి అంతకుముందు వికాస్ మాలిక్ ( నవాజద్దీన్ సిద్ధికి ) తో కొన్ని గొడవలు ఉంటాయి. ఆ గొడవలకి ఈ పాప వ్యాధికి మధ్య సంబంధం ఏంటి..? వెంకటేష్ తన పాపకి ఇంజక్షన్ చేయించి ఆ పాపని బ్రతికించుకున్నాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ కథ సాగనున్నట్లుగా తెలుస్తుంది.

Saindhav Movie Review : సైంధవ్ మూవీ రివ్యూ – విశ్లేషణ :

డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాని చాలా కొత్తగా తెరకెక్కించాడట. ఇక ఈ సినిమాలో ఒక తండ్రి తన కూతురు కోసం ఎక్కడి దాకైనా వెళతాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా ట్విస్ట్ లు కూడా పొందుపరిచినట్లుగా ఉన్నారు. ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ సినిమాను నడిపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఆత్రుతతో సీట్ ఎడ్జ్ మీద కూర్చొని సినిమాని చూసేలా ఈ స్టోరీని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి వెంకటేష్ సినిమాలో సైకో టైప్ ఆఫ్ పాత్రను పోషించారు అని చెబుతున్నారు. నవజద్దీన్ సిద్ధికి క్యారెక్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందట. వెంకటేష్ కి పోటీగా నవజద్దీన్ చేసే ప్రయత్నాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయట. ఇక సినిమాలో వెంకటేష్ , శ్రద్ధ శ్రీనాథ్ ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగైతే ఉంటారో అలాంటి పాత్రను పర్ఫెక్ట్ గా చేశారట. అలాగే ఇది నవాజ్ సిద్ధికి సరికొత్త క్యారెక్టర్తో తెలుగులో పరిచయం అయ్యాడని అంటున్నారు. ఆయన తెలుగులో పరిచయం అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెబుతున్నారు. ఆర్య కూడా ఇందులో మానస్ అనే పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో తన నటనతో మెప్పించినట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా కి సంగీతం కూడా చాలా హెల్ప్ అయిందట. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వెంకటేష్ కి పాపకి మధ్య వచ్చే సెంటిమెంటల్ సీన్స్ చాలా ఎలివేట్ చేసేలా ఉన్నాయట. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయట. సినిమా ఆటోగ్రాఫీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందట. ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ గా ఉన్నాయని తెలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :-

నటన
సెంటిమెంట్
ట్విస్టులు
యాక్షన్

మైనస్ పాయింట్స్ :-

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

Rating :

2.8/5

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది