Salaar Part 1 Movie Review : సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ Prabhas ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సలార్ సినిమా విడుదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి తరువాత అంత పెద్ద సినిమా రాలేదని, ఈ మూవీతో అయినా ఆ ఆశ తీరుతోందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నరు. ప్రభాస్ సలార్ మూవీ హిట్ అవుతుందని ఆశకు మరో కారణం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత నీల్ ఈ మూవీ దర్శకుడు కావడం విశేషం. అందుకు ఈ సినమాకు హై ఎక్స్‌పెట్టేషన్స్‌తో డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే రికార్టు స్థాయిలో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అవడం విశేషం.ఈ మూవీ రికార్డ స్థాయిలో థియేటర్స్‌లో విడుదలవుతుంది. సలార్ రెండు పార్ట్‌లుగా రూపొందిందనన్న విషయం మనకు తెలిసిందే. మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా అంచనాలు మరింత పెరిగింది. ఇక ట్రైలర్‌లోనే మూవీ స్టోరీ , పాత్రలను , తీరు గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇట్రో ఇచ్చాడు. దీంతో మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పడు తాజా సలార్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ది తెలుగు న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది.
ఈ సినిమా కథ 1995లో పిల్లల స్నేహాన్ని చూపిస్తూ అస్సాంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న ఓ బొగ్గు గనిలో దేవా(ప్రభాస్) పని చేస్తుంటాడు. అదే ప్రాంతంలో ఆధ్య(శృతిహాసన్) ఒక టీచర్ గా పని చేస్తుంటుంది. తనను కొందరు రౌడీలు కిడ్నాప్ చేస్తారు. తనను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా దేవా తనను కాపాడుతాడు. అదే సమయంలో దేవా ఫ్రెండ్ వరదరాజు మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్).. దేవాను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. మరోవైపు ఇండియాకు సరిహద్దుగా ఉన్న ఓ ప్రాంతంలో ఖాన్సార్ అనే అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ తర్వాత కాలంలో అది ఒక రాజ్యంగా మారుతుంది. ఖాన్సార్ రాజ్యాన్ని మన్నార్ వంశానికి చెందిన వాళ్లు పాలిస్తూ ఉంటారు. అయితే.. అక్కడ యుద్ధం చేయకూడదని ఉన్న ఒప్పందాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతాన్ని పాలించే వరదరాజు తండ్రి రాజమన్నార్(జగపతిబాబు) రాజ్యాన్ని వదిలేసి వెళ్తాడు. అయితే.. దేవాను వెతుక్కుంటూ ఒక రాజ్యాధిపతి ఎందుకు వచ్చాడు అనేదే ఇక్కడ పెద్ద ట్విస్ట్.
అందుకే దేవా, వరదరాజు బాల్యానికి సంబంధించి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నడుస్తుంది. నిజానికి వాళ్ల ఫ్లాష్ బ్యాక్ తోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే అస్సాంలో బొగ్గు గనిలో పని చేస్తూ కనిపిస్తాడు.. అండర్ గాడ్ గా ఉంటాడు దేవా. అయితే.. అండర్ డాగ్ గా దేవాను చూపించడం ఒక వైపు అయితే మరోవైపు దేవా అసలు క్యారెక్టర్ ను చూపిస్తారు. అసలు దేవా ఎవరు? అతడి గతం ఏంటి? అనేది ఫస్టాఫ్ లోనే చూపిస్తాడు డైరెక్టర్. ఆ తర్వాత సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్ లో మొత్తం ఖాన్సార్ రాజ్యం గురించే చూపిస్తారు.
ఖాన్సార్ రాజ్యంలో రాజమన్నార్ అధినేతగా ఉంటాడు. ఆయన కొందరరు సామంత రాజును నియమించడంతో కథ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది. ఈ సామంత రాజులు కుట్రలు చేయడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. రాజమన్నార్ ఒకసారి పని మీద బయటికి వెళ్లడంతో సామంత రాజులు కుట్రలు చేస్తుంటారు. అది ఖాన్సార్ పీఠం కోసం చేసే కుట్రలు. అప్పుడే దేవా ఎంటర్ అయి ఖాన్సార్ ను ఎలా సామంతులు చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుతాడు అనేదే అసలు స్టోరీ.
తన ఫ్రెండ్ కోసం శత్రువులను అందర్ని దేవా అడ్డుతొలగిస్తాడు. ఖాన్సార్ రాజ్యాన్ని రాజమన్నార్ అప్పగిస్తాడు దేవా. అయితే రాజ్యం కోసం మన్నార్ తనని వాడుకున్నాడని దేవా తెలుసుకుంటాడు. ఇక్కడే పెద్ద ట్వీస్టు మొదలవుతుంది. తరువాత తన ఫ్రెండ్ కి ఎలా బుద్ది చెబుతాడు, ఖన్సార్ రాజ్యాన్ని దేవా మళ్లీ ఎలా సొంత చేసుకుంటాడనేదే స్టోరీ. దేవాని మోసం చేసిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మిగిలిన స్టోరీ. అయితే ఇందులో సెంటిమెంట్, డ్రమా, సన్నివేశాలు కూడా బాగా వచ్చాయి. ప్రభాస్ యాక్షన్ సీన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇందులో శృతిహాసన్ పాత్ర చాలా కీలకమైంది. కథని మలుపులు తిప్పే విధంగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ చూశాక రెండో పార్ట్ కోసం ఎదురుచూసేలాగా ట్విస్ట్‌లు కూడా పెట్టి డైరెక్టర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే దాని కంటే ముందు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకోవాలి. కేజీఎఫ్ తర్వాత అద్భుతమైన మరో స్క్రిప్ట్ తో అది కూడా ప్రభాస్ కు సరిపోయే స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను అద్భుతంగా మలిచాడు. ఒక విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ ను మించేలా సలార్ ఉందనే చెప్పుకోవాలి. ఛత్రపతి, బాహుబలి సిరీస్ లాంటి సినిమాలతో ప్రభాస్ సత్తా ఏంటో అందరికీ తెలిసిపోయింది. అందుకే సలార్ లాంటి కథకు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ను ఎంచుకున్నాడు. ప్రభాస్ తర్వాత అంతే ఇంటెన్సివ్ ఉన్న పాత్రలో పృథ్వీరాజ్ నటించగా.. ఆ తర్వాత కీలక పాత్రల్లో శృతిహాసన్, ఈశ్వరీరావు, జగపతిబాబు నటించారు. టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాటోగ్రఫీ అదుర్స్ అనే చెప్పుకోవాలి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. బీజీఎంతోనే సినిమాకు హైప్ విపరీతంగా వచ్చేసింది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది యాక్షన్ సీన్స్. అది హైలెట్ అని చెప్పుకోవాలి. ప్రభాస్ అయితే చెలరేగిపోయాడు అని చెప్పాలి. సెకండాఫ్ లో ప్రభాస్ విధ్వంసాన్ని చూస్తారు ప్రేక్షకులు. ఈ సినిమా పార్ట్ 2 ఉందని సినిమా ఎండింగ్ లోనే డైరెక్టర్ చెప్పేస్తాడు. అంటే.. ఈ సినిమా పార్ట్ 2 త్వరలో వస్తుందని ఫస్ట్ పార్ట్ లోనే హింటిచ్చాడు డైరెక్టర్. అయితే.. క్లైమాక్స్ లో ఒక భారీ ట్విస్ట్ ను రివీల్ చేస్తాడు డైరెక్టర్. ఖాన్సార్ మొత్తం రక్తపాతాన్ని చూస్తుంది.
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, తిను ఆనంద్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు, మధు గురుస్వామి, సప్తగిరి, పృధ్వీ రాజ్, మహేశ్, నాగజీ, ఝాన్సీ, , దుబ్బాక భాస్కర్ రావు, జెమినీ సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్ యాక్టింగ్
శృతి హాసన్
చివరి వరకు ఉత్కంఠగా అనిపించడం
ప్రశాంత్ నీల్ డైరెక్షన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్:
కథ సాగదీత
రక్తపాతం
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
This website uses cookies.