Sankranthiki Vasthunnam Movie Review : విక్టరీ వెంకటేష్ Venkatesh అనీల్ రావిపూడి Anil Ravipudi సూపర్ హిట్ కాంబో మూడోసారి కలిసి చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు భీంస్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు. ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం తో వస్తున్నారు. ఐతే ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా 14న వస్తుంది. మంగళవారం పండగ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేశారు.
వెంకటేష్ సినిమాలో ఉండాల్సిన అన్ని ఎంటర్టైన్మెంట్ అంశాలు ఇందులో ఉన్నాయి. అనీల్ మార్క్ కామెడీ వెంకటేష్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఎమోషన్ అన్ని ఈ సినిమాలో ఉండేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు తరహాలో పెళ్లై భార్యతో ఉన్న అతనికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే మాత్రం అదిరిపోతుంది.ఇక సినిమాలో భీమ్స్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. గోదారి గట్టు మీద సాంగ్ సూపర్ హిట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమాకు ఆ పాట చాలా హై ఇచ్చింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ కూడా సినిమాలో సాంగ్ పాడటం ఆ సాంగ్ కి మంచి బజ్ వచ్చింది.
నటీనటులు : వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి
కెమెరా మెన్ : సమీర్ రెడ్డి
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత : దిల్ రాజు
రిలీజ్ డేట్ : జనవరి 14, 2025
ఇలా ప్రతి అంశాన్ని చాలా ప్లానింగ్ తో చేశాడు అనీల్ రావిపుడి. చూస్తుంటే సంక్రాతికి బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ అందించేలా సంక్రాంతికి వస్తున్నాం వచ్చేలా ఉంది.
ఎన్.ఆర్.ఐ అయిన సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) తెలంగాణా చీఫ్ మినిస్టర్ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొనడానికి వస్తాడు. ఆ టైం లో బిజ్జు పాండే గాంగ్ సత్యాని కిడ్నాప్ చేస్తుంది. బిజ్జు బ్రదర్ పప్ప పాండే ని రిలీజ్ చేస్తే కానీ సత్యాని వదిలేస్తామని అంటారు. ఐతే దీని కోసం ఐ.పి.ఎస్ ఆఫీసర్ మీను (మీనాక్షి చౌదరి) ఫార్మర్ ఆఫీసర్ వై.డి రాజు (వెంకటేష్)ని రంగంలోకి దించాలని అంటుంది. ఆమె సలహా మేరకు వై.డి.రాజు కోసం మీను వెళ్తుంది. తన ఎక్స్ లవర్ అయిన మీను రాకతో వై.డి రాజు జీవితంలో ఏం జరిగింది. వై.డి రాజు ఏం చేశాడు అన్నది సినిమా కథ.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఆయన సినిమాల్లో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్స్ గా ఉంటాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా తన మార్క్ ఎంటర్టైనింగ్ తో మెప్పించాడు. ఐతే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాజిబుల్ కామెడీతో మెప్పించారు. ఐతే సినిమా సెకండ్ హాఫ్ సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలేమి లేవు.
సినిమా అంతా కూడా వెంకటేష్ మార్క్ కామెడీతో నడిపించేశాడు. సినిమాలో డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తన బలమైన కామెడీ సీన్స్ బాగానే రాసుకున్నా మిగా విషయాల్లో తను ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా ఏమాత్రం లాజిక్ లేని సీన్స్ ప్రేక్షకులను కాస్త విసుగు తెప్పిస్తాయి.
అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబో అంటే సూపర్ హిట్ అన్నట్టే. ఐతే ఈసారి అనిల్ రావిపూడి ఏమాత్రం ఆకట్టుకోలేని కథతో సన్ర్కాంతికి వస్తున్నాం అని వచ్చాడు. స్టోరీ పెద్దగా ఏమి లేదు. స్క్రీన్ ప్లే కూడా ఆశించిన విధంగా లేదు. కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి. మిగతా అంతా కూడా ఆకట్టుకోలేదు.
వెంకటేష్ ని బాగానే వాడుకున్నాడు కానీ బలహీనమైన కథ వల్ల సినిమా ఆశించిన రేంజ్ లో అనిపించలేదు. అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా మరోసారి సేఫ్ సైడ్ అయ్యే కథనంతో లాగించేశాడు. వెంకటేష్ మార్క్ ఎంటర్టైనింగ్ ఉండటం వల్ల సినిమా పాసబుల్ అనిపించేస్తుంది.
ఐతే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతగా బాగాలేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లోనే లాగించేశారనిపిస్తుంది. ఐతే సంక్రాంతికి వచ్చిన గేం ఛేంజర్, డాకు మహారాజ్ రెండిటిలో లేని ఎంటర్టైన్మెంట్ దీనిలో ఉంది కాబట్టి వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.
వెంకటేష్ ఎప్పటిలానే మెప్పించాడు. సినిమాలో ఆయనే హైలెట్ అంశంగా చెప్పొచ్చు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు కూడా ఆకట్టుకున్నారు. మిగతా వారంతా కూడా పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కథకు తగినట్టుగా ఉంది. భీంస్ మ్యూజిక్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అనిల్ రావిపూడి కామెడీతో మరోసారి సినిమాను గెలిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా ఆకట్టుకోలేదు…
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్
ఫస్ట్ హాఫ్ కామెడీ
భీంస్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
లాజిక్ లేని సీన్స్
సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే
బాటం లైన్ :
సంక్రాంతికి వస్తున్నాం.. సగమే ఎంటర్టైన్మెంట్..!
రేటింగ్ : 3/5
PMJJBY : కేంద్ర ప్రభుత్వం తన రెండు ప్రధాన బీమా పథకాలైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన…
Sankranti Festival : సంక్రాంతి పండగ అంటే మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు, గాలి పటాలు ఎగరేయడం కాదు.…
Lotta Peesu Plant : లొట్ట పీసు అని కొట్టు పారేయకండి ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.…
Shankar : ఒకప్పుడు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్…
Zodiac Signs : పుష్య మాంసం పౌర్ణమి ఈ రోజున వచ్చింది. అంతేకాకుండా Zodiac Signs ప్రయాగ్ రాజ్ లో…
Tulsi : నేటి కాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. Tulsi ఇటువంటి పరిస్థితులలో ఇప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు…
Zodiac Signs : శని దేవుడిని న్యాయదేవతగా భావిస్తారు. అలాగే కలియుగానికి Zodiac Signs న్యాయ నిర్ణేతగా కూడా చెబుతారు.…
Sreemukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి Sreemukhi బుల్లితెర మీద తన మాస్ హంగామా చూపిస్తుంది. షో ఏదైనా ఛానెల్…
This website uses cookies.