Categories: NewsTelangana

Revanth Reddy : రేవంత్ రెడ్డి పాల‌న‌పై ప్ర‌త్యేక స‌ర్వే.. లైవ్‌లోకి ఊహించ‌ని ఫ‌లితాలు..!

Revanth Reddy : ప్ర‌స్తుతం తెలంగాణ‌లో Telangana కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి త‌మ‌దైన పాల‌న‌లో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయినా తరువాత ఎమ్మెల్యే ల పనితీరుపై సర్వే జరిగిందన్న ప్రచారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తిగా మారింది. అయితే ఎలాంటి సర్వే జరుగలేదని జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యే లు కొట్టిపారేస్తుంటే.. కొంతమంది ఎమ్మెల్యే లు‌ మాత్రం సర్వే జరిగిన విషయం నిజమేనని నిర్ధారిస్తున్నారు. దాంతో తమ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు అందాయో అని వారి అనుచరుల్లో టెన్షన్ మొదలైందంట.ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, మరో విపక్ష పార్టీ బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, Revanth reddy పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు పలు సర్వేలు జరిపినట్లు వార్త‌లు వ‌చ్చాయి. నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు, అక్కడి సిటిటంగ్‌ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ సందర్భంగా ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల గ్రాఫ్‌ తగ్గిందా… పెరిగిందా… తగ్గితే ఎందుకు తగ్గింది..సిట్టింగ్‌ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఎమ్మెల్యే ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉంటున్నారు. అనే వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది.

Revanth Reddy : రేవంత్ రెడ్డి పాల‌న‌పై ప్ర‌త్యేక స‌ర్వే.. లైవ్‌లోకి ఊహించ‌ని ఫ‌లితాలు..!

Revanth Reddy ఆస‌క్తిక‌ర స‌ర్వే…

ముఖ్యమంత్రి కూడా ఇటీవల నేను మారాను, మీరు మారండి. మనం ఒక్కసారి ఎమ్మెల్యే అయితే సరిపోదు. ఇంకో పదేళ్లు మీమీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా గెలిచేలా ప్రజలకి దగ్గర ఉండి‌ సేవలు చేయాలని ఎమ్మెల్యేలకి, మంత్రులకి సూచించారంటున్నారు. సీఎం అంత ప్రత్యేకంగా ఆ అంశాన్ని ప్రస్తావించినట్లు జరుగుతున్న ప్రచారంతో జిల్లాలో ఎమ్మెల్యే గ్రాఫ్ పై థర్డ్ పార్టీ ద్వారా రహస్యంగా సర్వే చేయించింది నిజమేనన్న అభిప్రాయంతో నియోజకవర్గం ప్రజలు తమ ఎమ్మెల్యే ల గురించి మాట్లాడుకుంటున్నారు.మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యే లు తాము ఇంత బాగా ప్రజలకి దగ్గర ఉంటూ నిత్యం నియోజకవర్గం లో పర్యటిస్తూ పైరవీలకు దూరం ఉంటున్నాంమని.. తాము‌ అయితే గ్రీన్ లేదంటే అరెంజ్ జోన్ లో ఉంటాం. తామెందుకి రెడ్ జోన్ లో ఉంటామని అనుకుంటున్నారంట. కొందరూ ఎమ్మెల్యే మాత్రం అనవసరంగా దందాలలో వేలు పెట్టాం. దాని గురించి ఎవరికి తెలియదనుకున్నాం. ఏడాది కాకముందే తమ‌ పనితీరు, దందాల గురించి ఇంటలిజెన్స్, థర్డ్ పార్టీ సర్వే ముఖ్యమంత్రి చేయించి రిపోర్ట్ తెప్పించుకుంటారని ఊహించలేదని మదన పడుతున్నారంట.

సర్వేలో సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రజాభిప్రాయం సేకరించినట్టు తెలిసింది. ఈ సర్వేలో కేసీఆర్‌పై ఇంకా ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదని సర్వేలో గుర్తించినట్లు సమాచారం. ఇందుకు రెండు ప్రధాన కారణాలను సర్వేలో గుర్తించినట్లు తెలిసింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోవడం, విపక్ష హోదాలో కేసీఆర్‌ ప్రజలకు దూరంగా ఉండడం కారణంగానే కేసీఆర్‌పై వ్యతిరేకత తొలగనట్లు సమాచారం. తెలంగాణ సీఎం పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు భావిస్తున్నారని సర్వేలో తేలింది. ఏడాది పాలనలో ఆయన గ్రాఫ్‌ పెరిగిందని సర్వేలో వెల్లడైంది. ఆయన పబ్లిక్‌ మీటింగ్స్‌లో మాట్లాడే భాష తీరు మారడం మంచిదని ప్రజలు భావిస్తున్నట్లు తెలిసింది

Recent Posts

Sahasra Case : క్రిమినల్ కావాలనేదే అతడి కోరిక !!

కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…

6 minutes ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

1 hour ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

2 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

3 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

4 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

5 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

6 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

7 hours ago