Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంకొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీత గోవిందం డైరెక్టర్ పరుశరామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 12న ప్రేక్షకులను పలకరించబోతోంది. కానీ.. ఇప్పటికే సినిమా యూఎస్ ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, సినిమా ట్రైలర్.. సినిమా రేంజ్ ను ఒక్కసారిగా పెంచేశాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్నీ ఫుల్ అయిపోయాయి. ఒక్క టికెట్ కూడా ఖాళీ లేకుండా థియేటర్లు అన్నీ నిండిపోయాయి.
ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటించాడు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ బాబు నుంచి ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. కోవిడ్ వల్ల సర్కారు వారి పాట సినిమా రిలీజ్ లేట్ అయింది. ఇక.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఒక రేంజ్ లో జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.120 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్సే ఇన్ని కోట్లలో జరిగితే.. సినిమా రిలీజ్ అయ్యాక.. వీకెండ్ లో ఇంకెన్ని కలెక్షన్స్ సాధిస్తుందోనని ఫిలిం నగర్ లో టాక్. మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను తిరగరాసేందుకు సర్కారు వారి పాట సినిమా సంసిద్ధం అవుతోంది. దితెలుగున్యూస్ వెబ్ సైట్ లో యూఎస్ ప్రీమియర్స్ లైవ్ అప్ డేట్స్ ను మీకోసం అందిస్తున్నాం.
నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, నదియ, శౌమ్య మీనన్, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, మహేశ్ మంజ్రెకర్, రవి ప్రకాశ్, సత్యం ప్రకాశ్ తదితరులు
డైరెక్టర్ : పరుశరామ్
కథ : పరుశరామ్
నిర్మాతలు : నవీన్ ఎర్నేనీ, వై రవి శంకర్, రామ్ అచంట, గోపిచంద్ అచంట
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేశ్
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ తమన్
బడ్జెట్ : రూ.60 కోట్లు
రన్నింగ్ టైమ్ : 160 నిమిషాలు
ప్రొడక్షన్ హౌసెస్ : మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్, జీ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్
రిలీజ్ డేట్ : 12 మే 2022
సినిమా స్టార్ట్ అయింది. సినిమా ప్రారంభమే యాక్షన్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కేవలం ఒకే ఒక్క రూపాయి బిళ్లతో మహేశ్ బాబు తండ్రి తన ఇంటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. తన చేతుల్లో కేవలం ఒక రూపాయి బిళ్ల మాత్రమే ఉంటుంది.
ఆ తర్వాత మహేశ్ బాబు ఎంట్రీ ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్ ప్రారంభంలోనే మహేశ్ బాబు ఎంట్రీ కూడా ఉంటుంది. ఆ తర్వాత పెన్నీ పాట ప్రారంభం అవుతుంది. పెన్నీ పాట పూర్తయ్యాక.. మహేశ్ బాబు మహీ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అనే ఒక ఫైనాన్స్ షాపును నిర్వహిస్తూ ఉంటాడు.
తన ఫైనాన్స్ షాపు ద్వారా అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. తన బిజినెస్ లో భాగంగా.. కీర్తి సురేశ్ ను కూడా కలవాల్సి వస్తుంది. అప్పుడే మహేశ్ కు కీర్తి సురేశ్ పరిచయం అవుతుంది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. చాలా రోజుల తర్వాత మహేశ్ బాబు నుంచి ఈ సినిమాలో సహజమైన నటనను ఈసినిమాలో చూడొచ్చు. ఆ తర్వాత కళావతి పాట వస్తుంది. ఈ పాటలో మహేశ్ బాబు స్టెప్స్ బాగున్నాయి. ఆ తర్వాత కళావతితో మహేశ్ కు చిన్న గొడవ అవుతుంది. దీంతో మహేశ్ బాబు ఇండియాకు తిరిగి వచ్చేస్తాడు.
మహేశ్ ఇండియాకు తిరిగి వచ్చాక.. విలన్ సముద్రఖనితో ఫేస్ టు ఫేస్ మాట్లాడాల్సి వస్తుంది. ఆ తర్వాత బీచ్ లో ఒక ఫైట్ ఉంటుంది. సినిమాలో వీఎఫ్ ఎక్స్ అయితే అదిరిపోయింది.
ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో రెండు సాంగ్స్ మాత్రమే వేశారు. పెన్నీ, కళావతి పాటలు. మహేశ్ బాబు ఈ సినిమాలో ఎక్సలెంట్ కామెడీతో పాటు చాలా స్టయిలిష్ గా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ లో మహేశ్ కామెడీ అదిరిపోయింది. ఇంటర్వల్ ఫైట్ కూడా అదుర్స్.
సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం బయట జరుగుతున్న టాపిక్ నే ఈ సినిమాలో తీసుకున్నాడు డైరెక్టర్. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఇచ్చే లోన్స్ గురించి ఈ సినిమాలో చర్చించారు.
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల.. జెస్సీ అనే ఓ ఊహాజనితమైన క్యారెక్టర్ ను మహేశ్ సృష్టిస్తాడు. ఆ క్యారెక్టర్ తో మహేశ్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాడు. సెకండ్ హాఫ్ లో మహేశా అనే పాట వస్తుంది. ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. కలర్ ఫుల్ సెట్స్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి.
మన దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు లోన్ తీసుకొని కట్టకుండా.. ఎలా నాశనం చేస్తున్నారో చెబుతాడు. వాటినే మనం ఎన్ పీఏలు అంటాం. దీని వల్ల దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ వస్తుందేమోనని మంత్రి భయపడతాడు.
ఆ తర్వాత బ్యాంక్ లో ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత ఈఎంఐలు కట్టడం, దాని కోసం బ్యాంక్ లకు ఒక సాధారణ వ్యక్తి ఎన్ని డబ్బులు కడుతున్నాడో మహేశ్ చెప్పిన వివరణ బాగుంటుంది. ఆ తర్వాత పవర్ ఫుల్ మెసేజ్ తో సినిమా ముగుస్తుంది.
పూర్తిస్థాయి సినిమా రివ్యూను కొద్దిసేపట్లో దితెలుగున్యూస్ వెబ్ సైట్ లో చూడగలరు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.