Thandel Movie Review : తండేల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thandel Movie Review : తండేల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 February 2025,11:10 pm

ప్రధానాంశాలు:

  •  Thandel Movie Review : తండేల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Thandel Movie Review : అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య Naga Chaitanya హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తండేల్ సినిమాకు దేవిఉ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలే హైలెట్ గా నిలిచేలా ఉంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇక రిలీజ్ ఒకరోజు ముందు ఆజాది సాంగ్ వదిలారు. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ కూడా అదిరిపోయింది. చూస్తుంటే తండేల్ సినిమాతో నాగ చైతన్య కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చేలా ఉన్నారు. తండేల్ సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది…

Thandel Movie Review తండేల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్

Thandel Movie Review : తండేల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

నటీనటులు : నాగ చైతన్య, సాయి పల్లవి, రావు రమేష్, కరుణాకరన్, ప్రకాష్ బెల్వాడి

కథ : కార్తీక్ తీడ

సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

కథనం మాటలు దర్శకత్వం : చందు మొండేటి

నిర్మాత : బన్నీ వాసు

సమర్పణ : అల్లు అరవింద్

రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 07, 2025

Thandel Movie Review సినిమా మీద భారీ హైప్

ఇప్పటికే సినిమా మీద భారీ హైప్ ఏర్పడింది. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీనే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. సినిమాలో సాయి పల్లవి Sai Pallavi ఉంది అంటే డ్యాన్స్ అదిరిపోతుంది. ఈ క్రమంలో సాయి పల్లవి ఈ సినిమాలో కూడా నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ చేసినట్టు తెలుస్తుంది.అంతేకాదు లేటెస్ట్ ప్రెస్ మీట్ లో తండేల్ సినిమా లాస్ట్ అర గంట నెక్స్ట్ లెవెల్ అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. కచ్చితంగా సినీ లవర్స్ అంతా కూడా మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రచార చిత్రాలు కూడా తండేల్ మీద విపరీతమైన బజ్ వచ్చేలా చేశాయి.

నాగ చైతన్య Naga Chaitanya అన్ని సినిమాలు ఒక లెక్క తండేల్ ఒక లెక్క అనిపించేలా ఉన్నాడు. సినిమా కమిట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ వరకు తన కెరీర్ లో ఎప్పుడు చేయని రిస్క్ ఈ సినిమాకు చేశాడని తెలుస్తుంది. తండేల్ సినిమా విషయంలో నాగ చైతన్య పడిన కష్టం తెర మీద అతను చూపించే విశ్వరూపానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా ఫిదా అవుతారని అంటున్నారు.తండేల్ సినిమాలో సాయి పల్లవి కూడా ఒక మేజర్ ప్లస్ అయ్యేలా ఉంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కోసం అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.తండేల్ సినిమాకు అన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యాయి. రిలీజ్ ముందు ఈ రేంజ్ పాజిటివ్ టాక్ ఈమధ్య కాలంలో ఏ సినిమాకు లేదు. ఇక సినిమా కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టినట్టే లెక్క.

Thandel Movie Review కథ :

శ్రీకాకులలో నివసిస్తున్న్ రాజు (నాగ చైఐతన్య) సముద్రంలో చేపలు పడుతూ జీవితం గడుపుతుంటాడు. తన చిన్ననాటి ప్రేయసి సత్య (సాయి పల్లవి) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రాజు తన తండేల్ టీం అంతా ఒకసారి సముద్రంలోకి వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేస్తారు. వారిని పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేస్తారు. రాజు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడని తెలిసి సత్య ఏం చేసింది. అతన్ని విడిపించడానికి ఆమె పడిన కష్టం ఏంటి అన్నదే సినిమా కథ.

Thandel Movie Review విశ్లేషణ :

ఒక బలమైన కథ రాసుకున్నప్పుడు దానికి తగినట్టుగానే కథనం ఉండాలి. తండేల్ విషయంలో అది కాస్త లోపించినట్టు అనిపిస్తుంది. తండేల్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ చూపిస్తారు. అసలైతే ఈ ఇద్దరి కెమిస్ట్రా బాగుంటుంది కానీ ఎందుకో ఈ సీన్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాయి. అంతేకాదు ఫస్ట్ హాఫ్ చాలా స్లో నరేషన్ అన్నట్టుగా ఉంటుంది.

ఇంటర్వెల్ కాస్త ఇంప్రెస్ చేసినా సెకండ్ హాఫ్ లో కాస్త సినిమా ఎంగేజ్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ 15 నిమిషాలు మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. సినిమా మొత్తం లో దర్శకుడు, నటీనటులు, సినిమాటోగ్రాఫర్, దేవి శ్రీ మ్యూజిక్ అన్ని క్లైమాక్స్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. సినిమాలో చైతన్య, సాయి పల్లవి జంట ఇంప్రెస్ చేసినా ఎక్కడో వీళ్లిద్దరి కెమిస్ట్రీ విషయంలో డౌట్ పడేలా చేశారు.

తండేల్ సినిమాలో పాకిస్తాన్ ఎపిసోడ్ సీన్స్ కొంతమేరకు బెటరే అనిపిస్తాయి. ఓవరాల్ గా తండేల్ సినిమా ఒకసారి చూసే సినిమాగా అనిపిస్తుంది.

నటీన & సాంకేతిక వర్గం :

నాగ చైతన్య మత్స్య కారుడుగా తన లుక్ స్లాంగ్ అన్ని బాగా కుదిరాయి. పర్ఫార్మెన్స్ లో కూడా బెస్ట్ ఇచ్చాడు. సాయి పల్లవి ఎప్పటిలానే బాగా చేసింది. వీళ్ల కెమిస్ట్రా వర్క్ అవుట్ అయ్యింది. ఇక సినిమాలో మిగతా పాత్ర దారులంతా బాగానే చేశారు.

టెక్నిక టీం విషయానికి వస్తే శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాలో మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. డైరెక్టర్ చందు మొండేటి కథనం మీద ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

నాగ చైతన్య

సాయి పల్లవి

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

స్లో నరేషన్

బాటం లైన్ :

తండేల్ ఒకసారి చూసేయొచ్చు..!

రేటింగ్ : 2.75/5

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది