Thandel Movie Review : తండేల్ ఫస్ట్ రివ్యూ.. ఆ ఆరు సీన్లు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం..!
ప్రధానాంశాలు:
Thandel Movie Review : తండేల్ ఫస్ట్ రివ్యూ.. ఆ ఆరు సీన్లు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం..!
Thandel Movie Review : నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. కాని ఈ సారి తండేల్‌తో చైతూ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అందరు నమ్ముతున్నారు. మూవీకి సంబంధించి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నాడు. మత్స్యకారుల నేపథ్యంలో కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా, ఈ చిత్రంలో కొందరు భారత జాలర్లు పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లడం, పాక్ కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో తండేల్ మూవీని తెరకెక్కించారు.
Thandel Movie Review ఈ సీన్స్ హైలైట్..
ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది.చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై చైతుతో పాటు.. పూర్తి మూవీ టీమంతా పూర్తి నమ్మకంతో ఉన్నారు. అయితే సెన్సార్ టాక్ ప్రకారం ఇందులోని కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయట. ఈ సినిమాలో నాగ చైతన్య- సాయి పల్లవి మధ్య నడిచే లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్ కానుందని అంటున్నారు. పాకిస్థాన్ జైల్ ఎపిసోడ్, సముద్రంలో షూట్ చేసిన ఓ ఫైట్ సీన్ మేజర్ హైలైట్స్ కానున్నాయట. సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగుతుందని, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదుర్స్ అని తెలుస్తోంది. ఇంటర్వెల్లో లాస్ట్ 25 నిమిషాల సీన్స్.. అలాగే ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మైండ్ బ్లాక్ చేయడం ఖాయమని టాక్ నడుస్తుంది..
సాయి పల్లవి పెర్ఫార్మన్స్ సినిమా హిట్ అయ్యేలా చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.ట్రైలర్ లో చూపించిన పాకిస్తాన్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సీన్ సినిమా స్టోరీని మలుపు తిప్పుతుందని టాక్..రీసెంట్ గా ఈ మూవీ టికెట్ ధరలు కూడా పెరిగినట్టు తెలుస్తుంది.. మొదటి వారం సింగిల్ స్క్రీన్ పై రూ.50.. మల్టీప్లెక్స్ రూ.75 పెంపుకు పర్మిషన్స్ లభించాయి. ఈ క్రమంలోనే ఏపీలో సింగిల్ స్క్రీన్ రూ.187 మల్టీప్లెక్స్ లో రూ.252 టికెట్ ధర ఉండగా.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ రూ.177 మల్టీప్లెక్స్ లో.. రూ. 295 టికెట్ ధరలు పెరిగినట్లు తెలుస్తుంది