JR NTR : ఫోన్ చేసి ఆట పట్టించాడు.. ఎన్టీఆర్‌పై వైష్ణవ్ తేజ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR NTR : ఫోన్ చేసి ఆట పట్టించాడు.. ఎన్టీఆర్‌పై వైష్ణవ్ తేజ్ కామెంట్స్

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తెరపై ఎలా ఉన్నా, ఏ పాత్రలో జీవించినా కూడా.. నిజ జీవితంలో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. తన చుట్టు పక్కల ఉండేవారిని ఎప్పుడూ నవ్విస్తుంటాడు. అలా ఎన్టీఆర్‌తో తనకు ఉన్న పరిచయం, చనువు గురించి వైష్ణవ్ తేజ్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ను మొదటగా రామ్ చరణ్ ఇంట్లోనే చూశాడట.. చాలా క్లోజ్ అయ్యారని, తనకు మరో అన్నయ్యలాంటి వాడని ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చాడు. JR NTR: ఎన్టీఆర్‌పై వైష్ణవ్ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :8 February 2021,7:19 pm

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తెరపై ఎలా ఉన్నా, ఏ పాత్రలో జీవించినా కూడా.. నిజ జీవితంలో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. తన చుట్టు పక్కల ఉండేవారిని ఎప్పుడూ నవ్విస్తుంటాడు. అలా ఎన్టీఆర్‌తో తనకు ఉన్న పరిచయం, చనువు గురించి వైష్ణవ్ తేజ్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ను మొదటగా రామ్ చరణ్ ఇంట్లోనే చూశాడట.. చాలా క్లోజ్ అయ్యారని, తనకు మరో అన్నయ్యలాంటి వాడని ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చాడు.

JR NTR Vaisshnav Tej about NTR

JR NTR: Vaisshnav Tej about NTR

JR NTR: ఎన్టీఆర్‌పై వైష్ణవ్ తేజ్ కామెంట్స్

ఎన్టీఆర్ చాలా హైపర్‌గా ఉంటాడట.రామ్ చరణ్‌ను ఎంత ఓన్ చేసుకున్నారో తనను కూడా అంతలా ఓన్ చేసుకున్నాడట. తాను ఒకసారి తన ఫ్రెండ్స్‌తో కాఫీ షాప్‌లో కూర్చొని ఉంటే ఒక ఫోన్ వచ్చిందట. హలో ఎవరండి అని అడిగాడట. నన్ను జూనియర్ ఎన్టీఆర్ అంటారు అని అంటూ ఆట పట్టించాడట.

ఆ వెంటనే తాను.. అన్న చెప్పండి అని అన్నాను. వెంటనే ఇంటికి రమ్మన్నారు. అక్కడ మా అన్న, చరణ్ అన్న ఉంటారేమో అనుకున్నాను. కానీ, ఆయన నన్నొక్కడినే పిలిచాడు. అక్కడికి వెళ్లాక ఆయన ఫ్రెండ్స్, ప్రణతి గారి స్నేహితులు ఉన్నారు. నన్నొక తమ్ముడిలా చూసుకున్నారు. కాసేపటికి మా అన్నయ్య కూడా వచ్చాడు. అలాగే, సీనియర్ యాక్టర్ నరేష్ గారి అబ్బాయి నవీన్‌ను కూడా పిలిచారు. వాళ్లంతా ఫ్రెండ్స్. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తారక్ అన్న అన్నారు. నేను అస్సలు ఊహించలేదు. ఆ రోజు నాకు చాలా ప్రత్యేకమంటూ వైష్ణవ్ తేజ్ ఎమోషనల్ అయ్యాడు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది