Uppena Moive : అవే ఎక్కువ కాలం గుర్తుండిపోతాయ్.. ‘ఉప్పెన’పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
Uppena Moive : ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెనను ప్రమోట్ చేసేందుకు అన్ని రకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాల్సిందంతా చెప్పేశాడు. నాగబాబు తన యూట్యూబ్ చానెల్‌లో కావాల్సినంత ప్రమోషన్ ఇచ్చాడు. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ షూటింగ్‌లొ బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఉప్పెన టీం ఆయన దగ్గరికే వెళ్లింది.
పవన్ కళ్యాణ్‌కు టీజర్, ట్రైలర్, కొంత కంటెంట్ కూడా చూపించారు. అయితే ఉప్పెన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హీరోగా తొలి చిత్రంలోనే వైష్ణవ్ మంచి కథ ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. ‘జానీ’లో బాలనటుడిగా హీరో చిన్నప్పటి పాత్ర పోషించిన అతను ఇప్పుడీ స్థాయికి ఎదిగాడంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

pawan kalyan about uppena and vaisshnav tej
Uppena Moive అవే ఎక్కువ కాలం గుర్తుండిపోతాయ్.. Pawan kalyan
బుచ్చిబాబు ఎంతో సమర్థవంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అర్థమవుతోంది. మన జీవితాల్ని.. అందులోని భావోద్వేగాల్ని.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. అందుకే ‘రంగస్థలం’, ‘దంగల్’ చిత్రాల్లో ఉండే భావోద్వేగాలు ఎక్కువకాలం గుర్తుండిపోతాయి. ‘ఉప్పెన’లోని భావోద్వేగాలు కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నా అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.