Ori Devuda Movie Review : విశ్వక్ సేన్.. ఓరి దేవుడా మూవీ ఫస్ట్ రివ్యూ..!!
Ori Devuda Movie Review : విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో తన సరికొత్త హైదరాబాదీ యాసతో తెగ ఫేమస్ అయిపోయాడు ఈ హీరో. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోలలో ఈయన ఒకరు. యువ హీరోలకు ఉన్న ఫాలోయింగ్ లో విశ్వక్ సేన్ కు కూడా మాంచి ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలలో ప్రేక్షకుడిని మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయడు విశ్వక్ సేన్. ఎందుకంటే ఆయన ఎంచుకునే కథలు అలా ఉంటాయి. ఇక.. ఓరి దేవుడా సినిమా గురించి చెప్పుకుంటే విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్ పోషించిన ఓరి దేవుడా సినిమా తాజాగా దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
Ori Devuda Movie Review : కథ
ఈ సినిమాలో మన హీరో పేరు అర్జున్. హీరోయిన్ మిథిలా పాల్కర్ పేరు అను. అర్జున్, అను ఇద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. కానీ.. అను ఒకసారి అర్జున్ ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. దీంతో అర్జున్ కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ.. అర్జున్ తల్లిదండ్రులు మాత్రం అనుతో తన పెళ్లిని నిర్ణయిస్తారు. అను తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటారు. ముహూర్తం నిర్ణయించడమే కాదు.. పెళ్లి కూడా చేసేందుకు సిద్ధం అవుతుండగా.. తను కేవలం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని.. ఆమెతో జీవితాంతం ఎలా జీవిస్తా అని గందరగోళంలో ఉండి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇంతలో అర్జున్ కు తన స్కూల్ లో సీనియర్ అయిన మీరా కలుస్తుంది. అప్పుడు మీరా ప్రేమలో అర్జున్ పడతాడా? చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు. అను ఏం చేస్తుంది? అనేది మిగితా కథ.
సినిమా పేరు : ఓరి దేవుడా
నటీనటులు : విశ్వక్ సేన్, వెంకటేశ్ దగ్గుబాటి, మిథిలా పాల్కర్, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, నాగినీడు
ప్రొడ్యూసర్స్ : పెరల్ వీ పుట్లూరు, పరమ వీ పుట్లూరు
మ్యూజిక్ : లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ : విధు అయ్యన
విడుదల తేదీ : 21 అక్టోబర్ 2022
Ori Devuda Review : సినిమా ఎలా ఉంది?
నిజానికి ఓరి దేవుడా అనే సినిమా తమిళ మూవీ ఓ మై కడువులే అనే సినిమాకు రీమేక్. తమిళ హక్కులను సొంతం చేసుకొని తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో కథను ఏమాత్రం మార్పులు చేయకుండా అలాగే తీశారు. అయితే.. ఇందులో విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్ చేయడంతో సినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఆయన వచ్చి విశ్వక్ సేన్ కు టికెట్ ఇచ్చే సీన్స్ బాగుంటాయి. వెంకటేశ్ ఉన్నంత సేపు సినిమాలోని సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. స్క్రీన్ ప్లే బాగుంది. యూత్ కు కనెక్ట్ అయ్యే బెస్ట్ మూవీ. ఇక.. సినిమా మొత్తాన్ని అర్జున్ క్యారెక్టర్ విశ్వక్ సేన్ ఒక్కడే మోసేశాడు. అర్జున్ గా ఎనర్జిటిక్ గా కనిపించాడు విశ్వక్. మొత్తానికి విశ్వక్ సేన్ ప్రేక్షకులను మరోసారి మెప్పించగలిగాడు. మంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.
ప్లస్ పాయింట్స్
మ్యూజిక్
గెస్ట్ రోల్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
వీఎఫ్ఎక్స్
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే ఈ సినిమాను సరదాగా వెళ్లి చూడొచ్చు. అంత బోరింగ్ గా అయితే ఉండదు. రొటీన్ కథ అయినప్పటికీ చెప్పిన విధానం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయొచ్చు.
దితెలుగున్యూస్ రేటింగ్ : 3.25/5