Afghanistan : సెమీస్‌కి చేరిన ఆఫ్ఘ‌నిస్తాన్.. బీసీసీఐకి తాలిబ‌న్ల మెసేజ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Afghanistan : సెమీస్‌కి చేరిన ఆఫ్ఘ‌నిస్తాన్.. బీసీసీఐకి తాలిబ‌న్ల మెసేజ్

Afghanistan : టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతం చేసింది. లీగ్ మ్యాచ్‌ల‌లోనే ఇంటి దారి ప‌డుతుంది అనుకుంటే ఏకంగా సెమీస్ చేరింది. ఆస్ట్రేలియా లాంటి బ‌ల‌మైన టీమ్‌ని కూడా మ‌ట్టి కరిపించింది. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.. దర్జాగా. దీని దెబ్బకు ఆస్ట్రేలియాకు సెమీస్ దారులు మూసుకుపోయాయి. గ‌త మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 115 ప‌రుగులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2024,1:00 pm

Afghanistan : టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతం చేసింది. లీగ్ మ్యాచ్‌ల‌లోనే ఇంటి దారి ప‌డుతుంది అనుకుంటే ఏకంగా సెమీస్ చేరింది. ఆస్ట్రేలియా లాంటి బ‌ల‌మైన టీమ్‌ని కూడా మ‌ట్టి కరిపించింది. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.. దర్జాగా. దీని దెబ్బకు ఆస్ట్రేలియాకు సెమీస్ దారులు మూసుకుపోయాయి. గ‌త మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 115 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లాదేశ్ వ‌ర్షం అంత‌రాయం కార‌ణంగా మ్యాచ్ ను 19 ఓవ‌ర్ల‌కు గానూ 114 ప‌రుగుల టార్గెట్ ను నిర్ణ‌యించాడు. 17.5 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో 8 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది.

Afghanistan తాలిబన్స్ థ్యాంక్స్..

ఈ మ్యాచ్ ఆరంభం నుంచి అనేక మ‌లుపులు, నాట‌కాలు క‌నిపించాయి. ప‌లుమార్లు వ‌ర్షం మ్యాచ్ ను అడ్డుకుంది. చిరు జల్లుల ప‌డుతున్న స‌మ‌యంలోనూ మ్యాచ్ సాగింది. ఎట్ట‌కేల‌కి ఆఫ్ఘ‌నిస్తాన్ గెలిచి సెమీస్ చేరుకుంది. కేప్టెన్ రషీద్ ఖాన్, నవీనుల్ హక్ నాలుగు చొప్పున వికెట్లు కూల్చారు. గులబ్బదీన్ నబీ, ఫజల్ హక్ ఫారూఖీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్స్ చేరిన రెండో జట్టయింది ఆఫ్ఘనిస్తాన్. టీమిండియా ఇప్పటికే సెమీ ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్ గెలుపును ఆ దేశ ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆకలి, పేదరికం, అణచివేత, నిరసనలతో స‌త‌మ‌తం అవుతున్న వారు ఆ బాధ, వేదనను మర్చిపోయి క్రికెట్ టీమ్ గెలుపును ఆస్వాదిస్తున్నారు.

Afghanistan సెమీస్‌కి చేరిన ఆఫ్ఘ‌నిస్తాన్ బీసీసీఐకి తాలిబ‌న్ల మెసేజ్

Afghanistan : సెమీస్‌కి చేరిన ఆఫ్ఘ‌నిస్తాన్.. బీసీసీఐకి తాలిబ‌న్ల మెసేజ్

ఇదే త‌రుణంలో అక్కడి తాలిబన్ సర్కారు నుంచి భారత క్రికెట్ బోర్డుకు ఓ స్పెషల్ మెసేజ్ అందింది. క్రికెట్​లో ఆఫ్ఘాన్ జట్టు ఎదుగుదల కోసం చేసిన కృషికి, అందిస్తున్న సాయానికి గానూ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పింది . భార‌త్‌కి ఎప్పుడు మేము రుణ‌ప‌డి ఉంటాం. ఆఫ్ఘానిస్థాన్ టీమ్ ఎదుగుదల కోసం వాళ్లు అందించిన సహాయ సహకారాలు అపూర్వం. భారత బోర్డు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేం అంటూ తాలిబన్ గ‌వ‌ర్న్‌మెంట్ పొలిటిక‌ల్ హెడ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. అయితే బీసీసీఐ.. వాళ్లు అడిగిన వెంటనే అవసరమైన వేదికలు ఇవ్వడం, సిరీస్​ల నిర్వహణ.. ఇలా ఎన్నో విధాలుగా రషీద్ సేనకు చాలా అండ‌గా నిలిచింది. ఈక్ర‌మంలోనే వారు సంతోషం వ్య‌క్తం చేస్తూ.. ఆఫ్ఘాన్​కు మన బోర్డు నుంచి ఇక మీదట కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది