
Anushka Sharma Emotional Post On Virat Kohli Century
Virat Kohli : క్రికెట్‌లో టాప్ మోస్ట్ బ్యాట్స్‌మెన్స్‌లో విరాట్ కోహ్లీ ఒకరు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డులని చెరిపేస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతం అవుతున్న కోహ్లీ పరుగుల వేటలో ఆకలిగొన్న పులిలా.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడి రన్స్ బాదాడు. మునుపటి కోహ్లీని తలపిస్తూ అభిమానులకు అసలైన మజా అందించాడు. ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా గురువారం అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ బాదాడు. కోహ్లీకి టీ20ల్లో ఇదే మొదటి సెంచరీ.
2019 నవంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్టులో శతకం బాదిన విరాట్.. 1021 రోజుల (2022 సెప్టెంబర్ 8) తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. రన్ మెషిన్ 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ 71 సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీని తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాకు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. ‘గత మూడేళ్ళుగా బయట చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. అవన్నీ చాలా నేర్పించాయి. నా దృక్పథాన్ని మార్చాయి కూడా. టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేస్తాననుకోలేదు. 71వ సెంచరీ చేయడం షాకింగ్‌గా అనిపించింది అని అన్నారు.
Anushka Sharma Emotional Post On Virat Kohli Century
వంద మార్కును చేరుకున్న వెంటనే మెడలో నుంచి తన భార్య అనుష్క శర్మ ఇచ్చిన లాకెట్‌ను తీసి ముద్దు పెట్టుకున్నాడు కోహ్లీ. తన భర్త చాలా కాలం తరువాత సెంచరీ చేయడంతో అనుష్క శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన భర్తపై ప్రేమను కురిపిస్తూ.. సెంచరీ మూమెంట్ ఫొటోలను షేర్ చేసుకుంది. ‘ప్రతిదీ ఎల్లపుడూ నీతోనే ఉంటుంది..’ అంటూ రాసుకొచ్చింది. హార్ట్ సింబల్‌ను యాడ్ చేసింది. అనుష్క పోస్ట్‌పై సినీ ప్రముఖులతో పాటు విరాట్ కోహ్లీ స్పందించాడు. హార్ట్ ఎమోజీలతో అనుష్కకు రిప్లై ఇచ్చారు కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Anushka Sharma Emotional Post On Virat Kohli Century
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.