BJP MP : వైద్యుడు దేవుడితో సమానం అని చాలా మంది అంటుంటారు.ఎందుకంటే కష్టాల్లో, ఆపదలో ఉన్నవారికి దేవుడే అండగా ఉంటాడని.. వారిని కాపాడుతుంటాడని చాలా మంది నమ్మకం. అలాగే ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి ప్రాణం పోసిన డాక్టర్లను కూడా రోగులు, బాధిత కుటుంబసభ్యులు కూడా దేవుడి లాగా ట్రీట్ చేస్తుంటారు. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి మా వాళ్లను కాపాడారని చెప్పుకుంటుంటారు.
కొందరు వైద్యులు ఈ మధ్యకాలంలో డబ్బుల కోసం ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. మరికొందరు మాత్రం నిబద్ధతతో వారి వృత్తి ధర్మాన్ని పాటిస్తుంటారు. ఇలా కొందరు సిన్సియర్‌గా వర్క్ చేస్తుండటం వల్లే ఇంకా వైద్యులు అంటే చాలా మంది గౌరవిస్తుంటారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు రోగులు వైద్యులను దేవుడి స్థానంలో ఉంచి కొలుస్తారని.. ఆ వృత్తికి ఎన్నడూ కళంకం తీసుకురావొద్దని కొందరు నేటికి ప్రయత్నిస్తున్నారు.
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి వైద్యుడు అందించిన ట్రీట్మెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సీపీఆర్ పద్ధతిలో అతనికి పునర్జన్మ నిచ్చిన వైద్యుడిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. కొల్హాపూర్‌లోని అర్జున్ అడ్నాయక్ అనే కార్డియాలజిస్ట్‌ను కలవడానికి ఓ పేషెంట్ అతని ఆస్పత్రికి వెళ్లగా.. ఉన్నట్టుండి కూర్చిలో కూర్చున్న రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
వెంటనే గమనించిన వైద్యుడు అతనికి చాతిపై నెమ్మదిగా గుద్దుతూ సీపీఆర్ అందించి అతనికి ప్రాణం పోశాడు. ఈ దృశ్యాలు ఆస్పత్రిలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తాజాగా ఈ వీడియోను కొల్హాపూర్ బీజేపీ ఎంపీ ధనుంజయ్ మహదిక్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.విపత్కర సమయంలో స్పందించి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యుడిని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.