Asia Cup : ఆసియా కప్ యాడ్స్ రేట్లు పైపైకి.. భారత్, పాక్ మ్యాచ్‌కు మరీ ఇంత డిమాండా?
ప్రధానాంశాలు:
Asia Cup : ఆసియా కప్ యాడ్స్ రేట్లు పైపైకి.. భారత్, పాక్ మ్యాచ్‌కు మరీ ఇంత డిమాండా?
Asia Cup : ఆసియా కప్ 2025 జరిగే సమయంలో అందరు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ యాడ్స్‌కి ఫుల్ డిమాండ్ ఉంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, మీడియా రైట్స్‌ను 2031 వరకూ కలిగిన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) భారత మ్యాచ్‌ల కోసం టీవీ యాడ్స్ రేటును ప్రతి 10 సెకన్లకు ఏకంగా రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు వసూలు చేస్తోంది.
మ్యాచ్ యాడ్స్‌కి ఫుల్ డిమాండ్
ఆసియా కప్ టీవీ ప్రకటనల ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి.
– కో-ప్రెజెంటింగ్ స్పాన్సర్‌షిప్ ప్యాకేజీ: ₹18 కోట్లు
– అసోసియేట్ స్పాన్సర్‌షిప్ ప్యాకేజీ: ₹13 కోట్లు
– స్పాట్-బై ప్యాకేజీ (భారత్ + ఇతర మ్యాచ్‌లు): ₹16 లక్షలు / 10 సెకన్లు
మొత్తంగా చూస్తే ₹4.48 కోట్లు ప్యాకేజీ వరకు వస్తుంది.
డిజిటల్ ప్రకటనల రేట్లు (Sony LIV) వద్ద ఉన్నాయి.
– కో-ప్రెజెంటింగ్ & హైలైట్స్ పార్ట్‌నర్: ఒక్కొక్కటి ₹30 కోట్లు
– కో-పవర్డ్ బై ప్యాకేజీ: ₹18 కోట్లు
– భారత్ మ్యాచ్‌ల కోసం 30 శాతం డిజిటల్ యాడ్స్ రిజర్వ్ చేశారు
ఫార్మాట్ ప్రకారం ప్రకటనలకు రేట్లు వసూలు
– ప్రీ-రోల్ యాడ్స్: ₹275 ( భారత్ మ్యాచ్‌లకు: ₹500, భారత్ vs పాకిస్తాన్‌కు: ₹750)
– మిడ్-రోల్ యాడ్స్: ₹225 (భారత్ మ్యాచ్‌లకు: ₹400, భారత్ vs పాకిస్తాన్‌కు: ₹600)
– కనెక్టెడ్ TV యాడ్స్: ₹450 (భారత్ మ్యాచ్‌లకు: ₹800, భారత్ vs పాకిస్తాన్‌కు: ₹1,200)