Mitchell Marsh : వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్.. క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్.. ఫోటో వైరల్ | The Telugu News

Mitchell Marsh : వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్.. క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్.. ఫోటో వైరల్

Mitchell Marsh : ఎంత దారుణం అంటే.. అసలు ఒక ట్రోఫీకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా. ప్రపంచ కప్ ట్రోఫీ అది. దాని మీద కాళ్లు పెట్టి ఇలా ప్రవర్తించడం అనేది ఎంత వరకు కరెక్ట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూసి నెటిజన్లు అయితే తెగ ఫైర్ అవుతున్నారు. చీ.. ఆస్ట్రేలియా క్రికెటర్ల బుద్ధి మారదా ఇక. ఎక్కువ కప్పులు కొట్టామని.. ఎక్కువసార్లు ట్రోఫీ గెలిచామనే ఓవర్ కాన్ఫిడెన్సా? లేక బలుపా? […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 November 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  ఆస్ట్రేలియా ఆటగాళ్ల బుద్ధి ఇక మారదా?

  •  వరల్డ్ కప్ ట్రోఫీకి ఘోర అవమానం

  •  సోషల్ మీడియాలో ఫోటో వైరల్

Mitchell Marsh : ఎంత దారుణం అంటే.. అసలు ఒక ట్రోఫీకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా. ప్రపంచ కప్ ట్రోఫీ అది. దాని మీద కాళ్లు పెట్టి ఇలా ప్రవర్తించడం అనేది ఎంత వరకు కరెక్ట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూసి నెటిజన్లు అయితే తెగ ఫైర్ అవుతున్నారు. చీ.. ఆస్ట్రేలియా క్రికెటర్ల బుద్ధి మారదా ఇక. ఎక్కువ కప్పులు కొట్టామని.. ఎక్కువసార్లు ట్రోఫీ గెలిచామనే ఓవర్ కాన్ఫిడెన్సా? లేక బలుపా? ట్రోఫీ విలువ తెలియని వాళ్లను అసలు ప్రపంచ కప్ లోనే తీసుకోవద్దు అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఆ ఫోటోపై ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలుసు కదా. ఆ కప్పును ఆస్ట్రేలియా క్రికెటర్లకు అందజేసిన తర్వాత ఆ కప్పును తీసుకొని ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ హోటల్ కు వెళ్లారు. అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కప్పును కింద పెట్టారు.

ట్రోఫీని కింద పెట్టి అవమానించడమే కాకుండా.. ఆ ట్రోఫీపై ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టాడు. బీరు తాగుతూ దాని మీద కాళ్లు పెట్టి ఫోటోలకు పోజులిచ్చాడు మార్ష్. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు అవమానించింది కేవలం ట్రోఫీని మాత్రమే కాదు.. వరల్డ్ కప్ ను, ఐసీసీనే అవమానించారు అని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు వరల్డ్ కప్ గెలిచినా ఆస్ట్రేలియా తీరు మాత్రం మారడం లేదు. 2006 లోనూ ఆస్ట్రేలియా కప్పు గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ తో వాగ్వాదానికి దిగారు. ట్రోఫీ తీసుకునే సమయంలో అమర్యాదగా ప్రవర్తించారు.

Mitchell Marsh : మరోసారి బయటపడ్డ ఆసీస్ వక్రబుద్ధి

క్రికెట్ లో తమను కొట్టేవాడు లేడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆస్ట్రేలియా ఆటగాళ్లలో నాటుకుపోయింది. అందుకే వరల్డ్ కప్ ట్రోఫీ మీద కనీసం గౌరవం లేకుండా దాని మీద కాళ్లు పెట్టడం, దాన్ని కింద పెట్టి అవమానించడం చేస్తున్నారు. 2006 లోనూ అదే చేశారు. ఇప్పుడు 2023 లోనూ అదే చేశారు. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...