Ind VS Eng : ఐసీపీ వన్డే ప్రపంచకప్ లో భారత్ జోరుమీదుంది. మామూలుగా కాదు.. సొంతగడ్డపై తిరుగులేని విజయాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. వన్డే ప్రపంచకప్ 2023 లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లన్నీ గెలిచి టాప్ ప్లేస్ లో నిలిచింది టీమిండియా. ఇప్పటికే ఆస్ట్రేలియా, అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ను భారత్ మట్టికరిపించింది. ఇక.. భారత్ తదుపరి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో ఉంది. ఈ ఆదివారం లక్నోలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ ఈసారి అంతగా ఫామ్ లో లేదు. మూడుసార్లు ఓడిపోయింది. దీంతో భారత్.. ఇంగ్లండ్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం భారత్ కు ఉన్న ఒక ఇష్యూ హార్దిక్ పాండ్యా. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో బౌలింగ్ వేస్తూ గాయపడి మధ్యలోనే మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు హార్దిక్ పాండ్యా. దీంతో పాండ్యా న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడలేదు. కాలు మణికట్టు వద్ద గాయం కావడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. దానివల్ల.. న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆరో బౌలింగ్ కి భారత్ కు ఇబ్బంది అయింది.
హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో కీలకంగా వ్యవహరిస్తాడు. దీంతో న్యూజిలాండ్ లో భారత్ కు హార్దిక్ లేని లోటు స్పష్టంగా తెలిసింది. షమీ రెచ్చిపోయి బంగ్లాను మట్టికరిపించాడు కానీ.. లేకపోతే భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉండేది. మరి.. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో అయినా హార్దిక్ బరిలోకి దిగుతాడా అనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే.. హార్దిక్ గాయంపై, ఇంగ్లండ్ మ్యాచ్ పై బీసీసీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇంగ్లండ్ మ్యాచ్ కి హార్దిక్ బరిలో దిగుతాడని స్పష్టం చేసింది. దీంతో హార్దిక్ పాండ్యా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్ మ్యాచ్ కి ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు హార్దిక్ కోలుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ధర్మశాలలోనే ఉన్నారు. దసరా సెలవులు రావడంతో అందరూ ఇంటికి వెళ్లకుండా ధర్మశాలలోనే స్టే చేస్తున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో టీమిండియా ప్లేయర్లు ఇంగ్లండ్ తో మ్యాచ్ కోసం లక్నో చేరుకోనున్నారు. ఈ మ్యాచ్ కు ఎక్కువ బ్రేక్ లభించడంతో త్వరగా కోలుకొని ఇంగ్లండ్ మ్యాచ్ కి హార్దిక్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.