Ind VS Eng : ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడా? బీసీసీఐ కీలక అప్ డేట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ind VS Eng : ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడా? బీసీసీఐ కీలక అప్ డేట్

Ind VS Eng : ఐసీపీ వన్డే ప్రపంచకప్ లో భారత్ జోరుమీదుంది. మామూలుగా కాదు.. సొంతగడ్డపై తిరుగులేని విజయాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. వన్డే ప్రపంచకప్ 2023 లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లన్నీ గెలిచి టాప్ ప్లేస్ లో నిలిచింది టీమిండియా. ఇప్పటికే ఆస్ట్రేలియా, అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ను భారత్ మట్టికరిపించింది. ఇక.. భారత్ తదుపరి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో ఉంది. ఈ ఆదివారం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 October 2023,1:00 pm

Ind VS Eng : ఐసీపీ వన్డే ప్రపంచకప్ లో భారత్ జోరుమీదుంది. మామూలుగా కాదు.. సొంతగడ్డపై తిరుగులేని విజయాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. వన్డే ప్రపంచకప్ 2023 లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లన్నీ గెలిచి టాప్ ప్లేస్ లో నిలిచింది టీమిండియా. ఇప్పటికే ఆస్ట్రేలియా, అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ను భారత్ మట్టికరిపించింది. ఇక.. భారత్ తదుపరి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో ఉంది. ఈ ఆదివారం లక్నోలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ ఈసారి అంతగా ఫామ్ లో లేదు. మూడుసార్లు ఓడిపోయింది. దీంతో భారత్.. ఇంగ్లండ్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం భారత్ కు ఉన్న ఒక ఇష్యూ హార్దిక్ పాండ్యా. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో బౌలింగ్ వేస్తూ గాయపడి మధ్యలోనే మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు హార్దిక్ పాండ్యా. దీంతో పాండ్యా న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడలేదు. కాలు మణికట్టు వద్ద గాయం కావడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. దానివల్ల.. న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆరో బౌలింగ్ కి భారత్ కు ఇబ్బంది అయింది.

హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో కీలకంగా వ్యవహరిస్తాడు. దీంతో న్యూజిలాండ్ లో భారత్ కు హార్దిక్ లేని లోటు స్పష్టంగా తెలిసింది. షమీ రెచ్చిపోయి బంగ్లాను మట్టికరిపించాడు కానీ.. లేకపోతే భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఉండేది. మరి.. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో అయినా హార్దిక్ బరిలోకి దిగుతాడా అనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే.. హార్దిక్ గాయంపై, ఇంగ్లండ్ మ్యాచ్ పై బీసీసీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇంగ్లండ్ మ్యాచ్ కి హార్దిక్ బరిలో దిగుతాడని స్పష్టం చేసింది. దీంతో హార్దిక్ పాండ్యా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్ మ్యాచ్ కి ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు హార్దిక్ కోలుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

bcci gives clarity on hardik pandya injury

#image_title

Ind VS Eng : ప్రస్తుతం ధర్మశాలలోనే టీమిండియా ఆటగాళ్లు

ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ధర్మశాలలోనే ఉన్నారు. దసరా సెలవులు రావడంతో అందరూ ఇంటికి వెళ్లకుండా ధర్మశాలలోనే స్టే చేస్తున్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో టీమిండియా ప్లేయర్లు ఇంగ్లండ్ తో మ్యాచ్ కోసం లక్నో చేరుకోనున్నారు. ఈ మ్యాచ్ కు ఎక్కువ బ్రేక్ లభించడంతో త్వరగా కోలుకొని ఇంగ్లండ్ మ్యాచ్ కి హార్దిక్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది