These are the four zodiac signs to watch out for due to the lunar eclipse on October 28
Lunar Eclipse : 2023వ సంవత్సరంలో అక్టోబర్ నెల 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం సందర్భంగా నాలుగు రాశులవారు అతి జాగ్రత్తగా ఉండాలి. నాలుగు రాశుల వారు కొన్ని అంశాల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే కొన్ని ప్రమాదాలు మీ జీవితంలో ఏర్పడే అవకాశం ఉంది. ఏ నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల వారి మీద ఉండబోతుంది. ఈ చంద్రగ్రహణం కారణంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ఈ చంద్రగ్రహణం నాడు ఇలాంటి జాగ్రత్తలు ఎలాంటి నియమాలు పాటించాలి. అలాగే ఎలాంటి పూజా విధానం మిమ్మల్ని రాబోయే ఇబ్బందుల నుంచి కాపాడుతుందో మీరు తెలుసుకోవచ్చు.. అక్టోబర్ 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం.
దీని యొక్క ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది. చంద్రుడు మరియు సూర్యుడికి మధ్య భూమి దాటినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి తిరిగేటప్పుడు భూమి నీడ చంద్రునిపై పడినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ 2023వ సంవత్సరంలో అక్టోబర్ 28వ తేదీన రాత్రి పదకొండు గంటల 31 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఇది తెల్లవారు 3:36 వరకు ఉంటుంది. ఇది ప్రకారం సూతక కాలం భారత కాలమాన ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది. సూతక కాలంలో గుడికి వెళ్ళటం కానీ దేవుని తాకటం కానీ పూజలు చేయటం కానీ చేయకూడదు. ఈ గ్రహణ సమయంలో నిషిద్ధమని చెప్పొచ్చు.. గ్రహణ ప్రభావం ఆహార పదార్థాలపై ఇంట్లో పూజా సామాగ్రి దేవత విగ్రహాలపై పడుతుంది అంటారు. కాబట్టి దర్భలు కానీ గరిక గాని తులసి కానీ వాటి మీద వేయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే గ్రహణ సమయంలో వృధా కార్యాలు చేయకూడదు.
These are the four zodiac signs to watch out for due to the lunar eclipse on October 28
ముఖ్యంగా దేవుని జపం చేయాలి. దేవుణ్ణి నమస్కరించుకోవాలి. హనుమాన్ చాలీసా అని పట్టించడం కానీ లలిత సహస్రనామ పారాయణం చేయడం కానీ పరమశివుని శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించడం కానీ చెయ్యొచ్చు. మంత్రోపదేశంతో ఎక్కువ సమయాన్ని గడపాలి. అలాగే గ్రహణ సమయంలో స్త్రీ పురుషుల శారీరక కలయిక కూడా మంచిది కాదు. ఈ చంద్రగ్రహణం వలన జాగ్రత్తగా ఉండవలసిన నాలుగు రాశులు మేషం, వృషభం, కన్య, మకరం ఈ రాశుల వారు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం తర్వాత ఈ రాశుల వారికి మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సొంత ఇంటి నిర్మాణం చేసుకోవడం వాహన కొనుగోలు స్థిరాస్తులు ఏర్పరచుకోవటం, బకాయిలు తీర్చేయటం ఇతరులకి సహాయం చేయటం అయిన వారిని ఆదుకోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు చేయగలుగుతారు. అనారోగ్య సమస్యలతో మీరు గాని మీ కుటుంబ సభ్యులు గాని బాధపడుతూ ఉంటే వాటికి పరిష్కార మార్గాలు దొరకబోతున్నాయి. అంతేకాకుండా ఈ గ్రహణ ప్రభావం కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఈ నాలుగు రాశుల వారు ఈ గ్రహణం తర్వాత ఇబ్బందికర వాతావరణంలో పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మీరు సాధారణం కంటే ఇంకా ఎక్కువగా పని చేస్తేనే సాధారణ ఫలితాలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక గంట పాటు పనిచేస్తే ఒక ఫలితం వస్తుంది అనుకుంటే ఈ నాలుగు రాశుల వారు నాలుగైదు గంటలు పని చేస్తే తప్ప ఒక సాధారణ ఫలితం రాదు. ఇక ఏదైనా విజయం కోసం ప్రయత్నిస్తున్న వారైనా ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారైనా అయితే ఈ కాలం మీకు గట్టి కాలమనే చెప్పాలి. ఎక్కువ కష్టపడితే సాధారణ ఫలితం వస్తుంది. మీరు సాధారణకి మించి కొంచెం కష్టపడ్డా కూడా మీకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
ఎక్కువగా అపజయాలు లేదా చెడు వార్తలు వినే ప్రమాదం ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి. సంతానానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. కొంతమంది ఆర్థికపరంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అధిక ఖర్చులు పెరుగుతాయి. అంతేకాదు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది. వస్తున్నటువంటి ఆదాయం అంతా ఏమవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ నాలుగు రాశుల వారు మాత్రం ఈ చంద్రగ్రహణం తర్వాత అత్యంత జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ నాలుగు రాశుల వారు ఏం చేయాలంటే రాబోయేటువంటి చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీరు కొన్ని పూజా విధానాలని పాటించాల్సి ఉంటుంది.
ఈ నాలుగు రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసినటువంటి ఒక పాము ప్రతిమ అలాగే చంద్రుడి ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకి దానం చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు మీ శక్తికి తగ్గట్టు వంటి దానధర్మాలు చేయడం భగవంతుని ఆరాధించటం సేవాధార్మిక కార్యక్రమానికి సమయాన్ని వెచ్చించటం వలన మీకు గ్రహణ ప్రభావం తోలుగుతుంది.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.