New Zealand : న్యూజిలాండ్ జట్టుకి పాకిస్తాన్ టిప్స్.. మన మీద ఎందుకంత కక్ష!
New Zealand : ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఏ జట్టు గెలుస్తుందా అని అందరిలో టెన్షన్ ఉండగా, దాయాది దేశం మనపై తమ అక్కసు ప్రదర్శిస్తుంది. ప్రముఖ క్రికెట్ Cricket షో “గేమ్ ఆన్ హై” లో షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్‌తో కలిసి ఈ మ్యాచ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “న్యూజిలాండ్ భారత్‌ను ఓడించాలని అనుకుంటే, వారు భారత్‌ను బలమైన జట్టు అని భావించడం మానేయాలి. అదే విధంగా, తాము అండర్‌డాగ్స్ అని కూడా మర్చిపోవాలి.
New Zealand : మరీ ఇంత అక్కసా..
రోహిత్ శర్మ ఎప్పుడూ అటాకింగ్ మూడ్‌లోనే ఉంటాడు. స్పిన్నర్లను Spinnersలక్ష్యంగా చేసుకుని, ఆటను నియంత్రించేందుకు ప్రయత్నిస్తాడు.నన్ను అడిగితే, ఈ మ్యాచ్‌లో భారత్‌కు 70-30 గెలుపు అవకాశాలు ఉన్నాయి. వారి బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్, అనుభవం అన్నీ కలిసి న్యూజిలాండ్‌కు కఠిన పరీక్షగా మారతాయి. అయితే, న్యూజిలాండ్ తమ A-గేమ్‌ను తేవగలిగితే, గెలిచే అవకాశముంది” అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

New Zealand : న్యూజిలాండ్ జట్టుకి పాకిస్తాన్ టిప్స్.. మన మీద ఎందుకంత కక్ష!
షోయబ్ మాలిక్ Shoaib malikకూడా ఈ మ్యాచ్‌పై తన విశ్లేషణను అందిస్తూ, స్ట్రైక్ రొటేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని న్యూజిలాండ్‌కు సూచించాడు. 20-30 పరుగుల వద్ద నిలిచే ఆటగాళ్లు, తమ ఇన్నింగ్స్‌ను 80-90 లేదా సెంచరీ వరకు తీసుకెళ్లేలా చూడాలి. అలా చేస్తేనే న్యూజిలాండ్ భారత్‌ను ఓడించే అవకాశాలను పెంచుకోవచ్చు” అని మాలిక్ వివరించాడు.వీరిద్దరు భారత్‌ని ఓడించేందుకు టిప్స్ ఇవ్వడం చూసి నెటిజన్స్ మండిపడతున్నారు.