CWG 2022 : కళ్లు చెదిరే క్యాచ్.. భారత మహిళా క్రికెటర్ మెరుపులు చూసి అంతా షాక్..!
CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతంగానే రాణించినా తుది మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది పరుగుల తేడాతో ఓడింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ సేనకు రజత పతకం లభించింది. అయితే ఈ మ్యాచ్‌లో పురుషుల క్రికెట్ కు ఏ మాత్రం తగ్గకుండా భారత ప్లేయర్లు మెరుపు విన్యాసాలతో అదరగొట్టారు. ముఖ్యంగా రాధా యాదవ్ , దీప్తి శర్మ లు ఫీల్డింగ్ లో మెరిపించారు. రాధా యాదవ్ రనౌట్, క్యాచ్ లతో పాటు.. దీప్తి శర్మ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి…
CWG 2022 : వారెవ్వా..
ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మగ క్రికెటర్స్ కన్నా మహిళా క్రికెటర్స్ ఏం తక్కువ కాదని అర్ధమవుతుంది. ఇటీవల ఒక భారత మహిళా క్రికెటర్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టింది. తాజాగా రాధా యాదవ్ అదరగొట్టింది. మొదట రాధా యాదవ్ తన అద్భుత ఫీల్డింగ్ తో మెరిసింది. అలీసా హీలీ తక్కువ స్కోరుకే అవుటైనా.. ఆస్ట్రేలియాను కెప్టెన్ మెగ్ ల్యానింగ్, బెత్ మూనీలు ఆదుకున్నారు. ఈ క్రమంలో ల్యానింగ్ అద్భుత షాట్లతో అలరించింది. ఆమె 36 పరుగుల వద్ద రాధా యాదవ్ సమయస్ఫూర్తికి రనౌట్ గా వెనుదిరిగింది. 11వ ఓవర్ వేయడానికి రాధా యాదవ్ బౌలింగ్ కు రాగా.. బెత్ మూనీ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉంది. ఆమె తొలి బంతిని స్ట్రయిట్ డ్రైవ్ ఆడింది.
బంతిని ఆపిన రాధా.. క్షణంలో తన కాళ్ల మధ్య నుంచి నాన్ స్ట్రయికింగ్ వికెట్లను గిరాటేసింది. పరుగు కోసం క్రీజు వదిలిని ల్యానింగ్ క్రీజులోకి చేరుకోవడంలో విఫలం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అచ్చం ధోనీలా రనౌట్ చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని తర్వాత తహిలా మెక్ గ్రాత్ ఇచ్చిన క్యాచ్ ను కూడా బ్యాక్ వర్డ్ పాయింట్ లో రాధా యాదవ్ తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ స్నేహ్ రాణా బౌలింగ్ లో మిడాన్ మీదుగా భారీ షాట్ పడే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న దీప్తి శర్మ వెనక్కు పరుగెడుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకుంది.
Radha Yadav’s diving catch ????????#INDvsAUS pic.twitter.com/TmhAVJVjLD
— Female Cricket #B2022 (@imfemalecricket) August 7, 2022