Dhoni Wife : భర్త ధోని గురించి భార్య సాక్షి అలా అనేసింది ఏంటి .. వైరల్ అవుతున్న వీడియో

Advertisement

Dhoni Wife : క్రికెటర్ ఎంఎస్ ధోని సతీమణి సాక్షి సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోని నిర్మాణ సంస్థలో తొలి సినిమా తమిళంలో నిర్మించడం జరిగింది.” ఎల్జీఎం” (లెట్స్ గెట్ మారీడ్) అనే టైటిల్ పేరిట సినిమా రాబోతోంది. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ ఇవాన ప్రధాన పాత్రలో నటించారు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ సినిమా జూలై 28వ తారీకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధోని భార్య సాక్షి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంపై సంచలన కామెంట్ చేశారు. తన లైఫ్ లో ఫస్ట్ టైం మీడియం ముందుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

క్రికెట్ అదేవిధంగా సినిమా రెండు కూడా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి. అయితే నేను ధోని ఎక్కువగా సినిమాలు చూస్తాం. సినిమా ఇండస్ట్రీ పరంగా మంచి కథలను ప్రజలకు చేరువ చేయవచ్చు. ఆ ఉద్దేశంతోనే మేము నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం జరిగింది. కాగా ప్రస్తుతం మా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. అయితే మొదట ఎల్జీఎం సినిమాతో తొలి అడుగు వేయడం జరిగింది. ఇది తమిళ్ సినిమా అయినా గాని తెలుగు రాష్ట్రాలలో ధోనీకి చాలామంది అభిమానులు ఉండటంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

Advertisement
dhoni wife sakshi viral comments on her husband video viral
dhoni wife sakshi viral comments on her husband video viral

ఈ క్రమంలో తెలుగులో అల్లు అర్జున్ తన అభిమాన హీరో అని ధోనీ భార్య చెప్పుకొచ్చింది. ఆయన నటించిన సినిమాలన్నీ చూసినట్లు కూడా తెలిపింది. బాహుబలి, RRR కూడా చూసినట్లు స్పష్టం చేసింది. కుదిరితే రాబోయే రోజులలో ప్రభాస్ అదేవిధంగా అల్లు అర్జున్ లతో సినిమాలు నిర్మించే అవకాశం ఉందని ప్రస్తుతం చిన్న సినిమాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఇదే సమయంలో పెళ్లిరోజు ముందు మాత్రమే ధోని వాళ్ళ అమ్మ గారిని చూడడం జరిగిందని ఆమె తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని సాక్షి చెప్పుకొచ్చింది. ధోని చాలా డిస్ ప్లేన్ గా బతకడానికి కారణం వాళ్ళ నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారని చెప్పుకొచ్చింది.

కాలేజీ లైఫ్ లో తన దృష్టి మొత్తం చదువు పైనే ఉండేదని ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంతగా తనకు తెలియవు అని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ధోని హీరోగా తాను నిర్మాతగా సినిమా చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు.. ఆరోజు తాను ఎంతగానో సంతోషిస్తానని సాక్షి చెప్పుకొచ్చింది. ఇక ఎల్జిటి సినిమాలో.. ధోని నటించారా అంటే సినిమా చూశాక ఆ ప్రశ్నకు మీకు సమాధానం దొరుకుతుందని సాక్షి చెప్పుకొచ్చింది.

Advertisement
Advertisement