MS Dhoni : ఈ నాన్చడం ఏంటి ధోని.. ఇక చాలు నాయనా ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు… ఫ్యాన్స్ ట్రోల్స్..!
ప్రధానాంశాలు:
MS Dhoni : ఈ నాన్చడం ఏంటి ధోని.. ఇక చాలు నాయనా ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు... ఫ్యాన్స్ ట్రోల్స్..!
MS Dhoni : ఐపీఎల్ 2025 సీజన్ IPL 2025 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) chennai super kings అభిమానులకు నిరాశను మిగిల్చింది. మొత్తం 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు సాధించి, 8 పాయింట్లతో లీగ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమయ్యింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న సీఎస్‌కేకి ఇది ఘోర అవమానం. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఎంఎస్ ధోని భవిష్యత్తు పై చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

MS Dhoni : ఈ నాన్చడం ఏంటి ధోని.. ఇక చాలు నాయనా ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు… ఫ్యాన్స్ ట్రోల్స్..!
MS Dhoni : చిరాకు తెప్పిస్తున్న ధోని
గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన చివరి మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో ధోని తన రిటైర్మెంట్ పై స్పష్టత ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగించాడు. తాను వచ్చే సీజన్‌లో ఆడతానని కానీ, ఆడనని కానీ ఏమిచెప్పకుండా ఉన్నాడు. రిటైర్మెంట్ పై తనకు 4 నుంచి 6 నెలల సమయం అవసరం అని చెప్పడం ఆయన అభిమానుల్లో కలవరం రేపింది. ఆటతీరు ఆధారంగా రిటైర్మెంట్ నిర్ణయించడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడినా, వయసుతో వచ్చే ఫిట్‌నెస్ సమస్యలను ఆయన తప్పుదోవ పట్టించినట్టు అనిపిస్తోంది.
ధోని ఫెర్మ్‌లో లేని ఈ సీజన్‌ను చూస్తే, ఆయన కొనసాగడం జట్టుకు భారం అవుతుందన్న భావన అభిమానుల్లో కలుగుతోంది. గత సీజన్ వరకు ధోనిని పొగడ్తలతో ముంచెత్తిన కామెంటేటర్లు ఈసారి మౌనం వహించగా, పలువురు అభిమానులు సోషల్ మీడియాలో ధోనికి విశ్రాంతి సూచిస్తున్నారు. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగతమైన నిర్ణయమే అయినా, అదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తే అతని గౌరవం తగ్గిపోయే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.