Virat Kohli – Gautam Gambhir: గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌కు ఎలాంటి విభేదాలు లేవు .. బ్యాటింగ్ కోచ్ కామెంట్స్ వైరల్
ప్రధానాంశాలు:
గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌కు ఎలాంటి విభేదాలు లేవు .. బ్యాటింగ్ కోచ్ కామెంట్స్ వైరల్
Virat Kohli – Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఎలాంటి విభేదాలు లేవని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న రూమర్లను ఆయన ఖండించారు. గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌లకు మంచి సత్సంబంధాలే ఉన్నాయని తెలిపారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే మ్యాచ్‌కు ముందు, మంగళవారం సితాన్షు కోటక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జట్టు అంతర్గత వాతావరణం, సీనియర్ ఆటగాళ్ల పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అలాంటిదేమి లేదు..
“విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు ప్రణాళికల్లో కీలక భాగంగా ఉన్నారు. ప్రస్తుతం వారు వన్డే ఫార్మాట్‌పై పూర్తి ఫోకస్‌తో ఉన్నారు. ప్రతి మ్యాచ్ గెలవాలనే లక్ష్యంతోనే ఆడుతున్నారు. తమ అపారమైన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకుంటున్నారు. సహచర ఆటగాళ్లతో తరచూ చర్చలు జరుపుతూ కనిపిస్తున్నారు” అని కోటక్ తెలిపారు. వన్డే ఫార్మాట్‌కు సంబంధించిన వ్యూహాలు, భారత్‌కు ముందున్న మ్యాచ్‌లు, సౌతాఫ్రికా పర్యటన ప్రణాళికలపై కోహ్లీ, రోహిత్‌లు హెడ్ కోచ్ గంభీర్‌తో చర్చిస్తున్నారని చెప్పారు. “వాళ్లు అనుభవాలను పంచుకోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. జట్టులో వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉంది” అని స్పష్టం చేశారు.
Virat Kohli – Gautam Gambhir: గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌కు ఎలాంటి విభేదాలు లేవు .. బ్యాటింగ్ కోచ్ కామెంట్స్ వైరల్
సోషల్ మీడియాలో వచ్చే వార్తలను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పిన కోటక్, “జట్టులో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. టీ20లు, వన్డేల మధ్య ఇంకా చాలా తేడా ఉంది. ప్రస్తుతం వన్డేల్లో 300 ప్లస్ స్కోర్లు సాధారణమయ్యాయి. భారత్‌లో అలాంటి స్కోర్లను ఎక్కువగా చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వాటిని ఛేజ్ కూడా చేస్తున్నాం” అని వివరించారు. భవిష్యత్ ప్రణాళికలపై స్పందించిన ఆయన, టీ20 ప్రపంచకప్ తర్వాత మరిన్ని వన్డేలు ఉండే అవకాశం ఉందన్నారు. 34 ఓవర్ల తర్వాత ఒకే బంతిని ఉపయోగించే కొత్త నిబంధన నేపథ్యంలో కొత్త బ్యాటింగ్ వ్యూహాలు అవసరమని చెప్పారు. అయితే ఏ ఆటగాడి భవిష్యత్తుపై మాట్లాడేందుకు తాను సరైన వ్యక్తిని కాదన్నారు.
రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “జడేజా ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒక ఆటగాడు ఆటను ఆస్వాదిస్తూ మంచి ఫామ్‌లో ఉన్నంత కాలం జట్టు కోసం ఆడుతూ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాడు” అని సితాన్షు కోటక్ అన్నారు. ఇదిలా ఉండగా, న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా, బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరిగే రెండో వన్డేకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇరు జట్లు రాజ్‌కోట్ చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.