Gautam Gambhir : బిగ్ బ్రేకింగ్.. టీమిండియా హెడ్ కోచ్‌కి బెదిరింపులు.. లేపేస్తామంటూ ఐసిస్ కాశ్మీర్ హెచ్చరిక
ప్రధానాంశాలు:
Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్‌కి బెదిరింపులు.. లేపేస్తామంటూ ఐసిస్ కాశ్మీర్ హెచ్చరిక
Gautam Gambhir : భారత క్రికెట జట్టు Indian Head Coach హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ నుంచి బెదిరింపులు అందాయి. దీనితో ఆయన హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారు. వారికి ఫిర్యాదు చేశారు. ఐసిస్ కశ్మీర్ నుంచి వచ్చినట్లు గౌతమ్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు.

Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్‌కి బెదిరింపులు.. లేపేస్తామంటూ ఐసిస్ కాశ్మీర్ హెచ్చరిక
Gautam Gambhir : గంభీర్‌కి బెదిరింపులు..
ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో, గంభీర్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. “నేను నిన్ను చంపుతాను” అనే మాటలతో కూడిన ఈ-మెయిల్‌ను గంభీర్‌కు పంపారని ఇండియా టుడే నివేదించింది.మాజీ బీజేపీ ఎంపీ అయిన గంభీర్ ప్రస్తుతం టీం ఇండియా ప్రధాన కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడికి గంభీర్ తీవ్రంగా స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాద్వారా “మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది” అని వ్యాఖ్యానించారు. భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా ఉన్న వ్యక్తికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు రావడం, దేశ భద్రత వ్యవస్థను అప్రమత్తం చేస్తోంది