Hardik Pandya : హార్ధిక్ – జాస్మిన్ డేటింగ్..? … ఈ జంట నిజంగా ప్రేమలో ఉన్నరా..?
ప్రధానాంశాలు:
హార్ధిక్ - జాస్మిన్ డేటింగ్..? ... ఈ జంట నిజంగా ప్రేమలో ఉన్నరా..?
Hardik Pandya : ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా రూమర్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియా కూడా వాంఖడే స్టేడియంలో ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత జాస్మిన్ ముంబై ఇండియన్స్ జట్టు బస్సులో కూర్చున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె, హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మరోసారి తెరమీదకు వచ్చాయి.

Hardik Pandya : హార్ధిక్ – జాస్మిన్ డేటింగ్..? … ఈ జంట నిజంగా ప్రేమలో ఉన్నరా..?
hardik pandya జాస్మిన్ తో హార్దిక్ .. ఇంకేముంది
హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా మధ్య ప్రేమాయణం లో ఉన్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జాస్మిన్ టీమిండియాకు మద్దతుగా కనిపించడంతో ఈ రూమర్లు మరింత బలపడ్డాయి. తాజాగా ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఆమె మళ్లీ హాజరవడంతో, ఈ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అన్న చర్చ నడుస్తోంది. గ్రీస్ వెకేషన్‌లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా వీరి మధ్య ఏదో ఉందని సూచిస్తున్నాయి.
జాస్మిన్ వాలియా బ్రిటీష్ సింగర్, భారత సంతతికి చెందిన ఆర్టిస్ట్. ఆమె ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌లో జన్మించిందని సమాచారం. హార్దిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న తర్వాత, ఇప్పుడు జాస్మిన్‌తో అతను డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.