Team India : టీమిండియాకు ఊహించని షాక్.. ఇంత కోత విధించారేంటి?
Team India : మంచి ఉత్సాహం మీద ఉన్న టీమిండియా దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. తొలి టెస్ట్‌లో మంచి విజయం సాధించిన ఇండియన్ టీం ఆ తర్వాత వరుస ఓటములు చవిచూసింది.ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆరోపిస్తూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. రాహుల్ సేన నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40 శాతం జరిమానా విధించింది. దీంతో భారత ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడనుంది.భారత కెప్టెన్ రాహుల్ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ ప్రకటించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ 4 పరుగులతో ఓడిన విషయం తెలిసిందే.ఐసీసీ నియామవాళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్ తక్కువగా వేస్తే 20 శాతం ఫైన్ విధిస్తారు. అదే రెండు ఓవర్లు తక్కువ వేస్తే 40 శాతం జరిమానా వేస్తారు. టీమిండియా రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయడంతో 40 శాతం ఫైన్ పడింది.కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆన్ ఫీల్డ్ అంపైర్లు మరైస్ ఎరాస్మస్, బొంగాని జెలే, థర్డ్ అంపైర్ పాలేకర్, ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్ స్టాక్ ఫిర్యాదు చేయగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Team India : మరో దెబ్బ…!
అయితే టీమిండియాను విచారించకుండానే ఐసీసీ జరిమానా వేయడం గమనార్హం. చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మరో బంతి మిగిలి ఉండగానే 287 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ (124) సెంచరీతో చెలరేగాడు. డస్సెన్ (52), మిల్లర్ (39) అతనికి సహకరించారు. అనంతరం 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ చివరి వరకు పోరాడి 283 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) రాణించారు.
India fined for slow over-rate in third ODI https://t.co/SsmaMz7oSl via @ICC
— ICC Media (@ICCMediaComms) January 24, 2022