ICC : ఇప్పుడు క్రికెట్ 11 మందితో కాదు, 9 మందితో కూడా ఆడొచ్చు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ICC : ఇప్పుడు క్రికెట్ 11 మందితో కాదు, 9 మందితో కూడా ఆడొచ్చు..

 Authored By sandeep | The Telugu News | Updated on :25 February 2022,3:30 pm

ICC : క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఐసీసీ స‌రికొత్త మార్పుల‌ని తీసుకొస్తుంది. క‌రోనా వ‌ల‌న ఇప్ప‌టికే బ‌యో బ‌బుల్ ప్ర‌వేశ‌పెట్టిన ఐసీసీ రాబోయే ప్ర‌పంచ క‌ప్ దృష్ట్యా స‌రికొత్త మార్పులు తీసుకొస్తుంది. న్యూజిలాండ్ వేదికగా మార్చి 4 నుంచి జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఏ టీమ్‌లో అయినా ప్లేయర్లు కరోనా బారిన పడితే తొమ్మిది మందితోనే మ్యాచ్ ఆడే అవకాశం కల్పిస్తామని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లే తెలిపారు.

మ్యాచ్ టైమ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు అందుబాటులో లేకుంటే ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్, కోచింగ్ స్టాఫ్‌లోని మహిళా మెంబర్స్ సబ్‌స్టిట్యూట్స్‌గా వచ్చే అవకాశం ఇస్తామన్నారు.నాన్ బ్యాటింగ్, నాన్ బౌలింగ్ సబ్‌స్టిట్యూట్స్‌గా ఇద్దరిని అనుమతించి మ్యాచ్ జరిగేలా చూస్తామని చెప్పారు. అవసరం అయితే మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. వాస్తవంగా ఏదైనా టోర్నీ, ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుంటే 15 మందితో జట్టును ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కరోనా ఉండటంతో… ముగ్గురిని రిజర్వ్ ప్లేయర్స్ గా ఎంపిక చేసే వెసులుబాటును ఐసీసీ తీసుకొచ్చింది. దాంతో ప్రతి జట్టు కూడా గరిష్టంగా 18 మంది ప్లేయర్ల్ తో మహిళల వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనొచ్చు

icc new rul for world cup

icc new rul for world cup

ICC : గోల్డెన్ ఆఫ‌ర్..

కరోనా కారణంగా ఒక టీమ్ లో దాదాపు 9 మంది పాజిటివ్ గా తేలిన మిగిలిన 9 మందితో మ్యాచ్ ఆడే విధంగా ఐసీసీ నిబంధనలను సవరించింది. భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ లోనే ఉంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా మార్చిన 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జరిగే మ్యాచ్ తో తమ ప్రపంచ కప్ వేటను మొదలు పెట్టనుంది. అనంతరం న్యూజిలాండ్ (మార్చి 10న), వెస్టిండీస్ (మార్చి 12న), ఇంగ్లండ్ (మార్చి 16న), ఆస్ట్రేలియా (మార్చి 19న), బంగ్లాదేశ్ (మార్చి 22), దక్షిణాఫ్రికా (మార్చి 27న) జట్లతో తలపడుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది