India Vs England : ఇంగ్లాండ్ సెమిఫైనల్ మ్యాచ్ లో పొరపాటున కూడా అది జరగకూడదు.. అంటున్న టీమిండియా ఫ్యాన్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India Vs England : ఇంగ్లాండ్ సెమిఫైనల్ మ్యాచ్ లో పొరపాటున కూడా అది జరగకూడదు.. అంటున్న టీమిండియా ఫ్యాన్స్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :10 November 2022,10:20 am

India Vs England : మరి కొద్ది గంటల్లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచిన పాకిస్తాన్ ఫైనల్ కి చేరుకోంది. దీంతో ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టి20 ప్రపంచ కప్ టోర్నీలో వర్ణుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో సెకండ్ సెమి ఫైనల్ మ్యాచ్ కి వర్ణుడు… అడ్డుపడకూడదని కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా టాస్ విషయంలో రోహిత్ గెలవకూడదని 130 కోట్ల మంది భారతీయులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. మేటర్ లోకి వెళ్తే అడిలైడ్ వేదికగా ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు జరిగాయి. ఈ 11 మ్యాచ్ ల్లోనూ టాస్ గెలిచిన జట్టు ఓటమి పక్షాన నిలిచింది. మరోపక్క రోహిత్ శర్మ … ఈ కీలకమైన మ్యాచ్ లో ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు.

India Vs England semi final match to Day on Team India fans Happy

India Vs England semi final match to Day on Team India fans Happy

ఇప్పటికే టీంలో కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రాహుల్ మంచి జోరు మీద ఉన్నారు. ఇటువంటి క్లిష్టమైన మ్యాచ్ లో రోహిత్ కూడా మంచి పరుగులు చేస్తే టోర్నీలో టీమిండియాకు తిరుగుండదని క్రికెట్ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక టోర్నీలో ఇంగ్లాండ్ మరియు ఇండియా టీంలు… అద్భుతంగా రానిస్తున్నాయి. బౌలింగ్ మరియు బ్యాటింగ్ ఇంకా అన్ని రకాలుగా కూడా సమంగా ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఈ రెండు టీమ్స్ లలో ఎవరు ఫైనల్ కి వెళ్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది