india vs pakistan : చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లేనా?
india vs pakistan : ఇండియన్ క్రికెట్ టీంకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఏదేని మ్యాచ్‌లో ఇండియా బరిలోకి దిగితే చాలు… విన్ అవ్వాలని ఆకాంక్షించేవారు చాలా మందే ఉన్నారు. ఇకపోతే దాయాది దేశమైన పాకిస్థాన్‌తో భారత్ తలపడినట్లయితే కంపల్సరీగా భారత్ గెలవాలని భారత అశేష ప్రజానీకం కోరుకుంటుంది. కాగా, చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ ఒకవేళ పాకిస్థాన్‌తో తలపడితే అందులో ఇండియా విజయం సాధించాలని ప్రతీ ఒక్క భారతీయుడు కోరుకుంటాడు.
ఇక ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండంటే చాలు ఇరు దేశాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. లైవ్ అప్‌డేట్స్ తెలుసుకుంటుంటారు. కాగా, పాకిస్థాన్ కంట్రీతో డిఫరెన్సెస్ కారణంగా కొన్నాళ్లుగా ఇండియా ఆ దేశంలో పర్యటనలు చేయడం మానుకుంది. ఈ క్రమంలోనే 2025లో చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆతిథ్యాన్ని భారత్ స్వీకరించి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పార్టిసిపేట్ చేసేనా? అనే విషయమై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఇండియా ఆ ట్రోఫీలో పాల్గొంటుందా ? అనే విషయమై ఇంత వరకు ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ, కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ఆ మ్యాచ్ పట్ల ఇంకా ఆసక్తి పెరిగింది.
india vs pakistan : దాయాదుల్లో నెగ్గేదెవరో?
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనుందా? అనే అంశంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాకిస్థాన్ దేశంలో గతంలో పర్యాటకులపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే అప్పటి పరిస్థితులను బట్టి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు కేంద్రమంత్రి. క్రీడా శాఖ మంత్రి చేసిన ప్రకటనను బట్టి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేందుకు సిద్ధంగ లేదని కొందరు వాదిస్తుండగా, అప్పటి పరిస్థితులను బట్టి తప్పనిసరిగా భారత్ పాల్గొంటుందని మరి కొందరు అంటున్నారు. చూడాలి మరి.. అప్పటి వరకు దాయాది దేశమైన పాకిస్థాన్ కంట్రీకి వెళ్లి మరి.. ఆ దేశంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందో లేదో..