IND – WI : వన్డే సీరీస్ క్లీన్ స్వీప్, రోహిత్ ఖాతాలో మరో విజయం…!
IND – WI : వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సీరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ ఓపెనర్లుగా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మాజీ కెప్టెన్ కోహ్లీ కూడా డకౌట్ కావడంతో భారత్ ఇబ్బంది పడింది. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ భారత జట్టుని నిలబెట్టారు.
కీలక సమయంలో వికెట్ లు పడకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పంత్, అయ్యర్ ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో పంత్ 56 పరుగుల వద్ద అవుట్ అయినా ఆ తర్వాత వచ్చిన సుందర్ తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసాడు అయ్యర్. దూకుడుగా ఆడే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నం చేసి అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు.

India vs West Indies ODI series India Won
ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోకపోయినా… సుందర్ 33 పరుగులు చాహర్ 38 పరుగులతో భారత జట్టుకి మంచి స్కోర్ అందించారు. విండీస్ కు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఏ దశలో కూడా విండీస్ లక్ష్యం దిశగా వెళ్ళలేదు. బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో విండీస్ 37 ఓవర్లకే చాప చుట్టేసింది. ఆ జట్టులో పూరాన్, జోసెఫ్, స్మిత్ మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు.