IPL : ధనాధన్ బ్యాటింగ్ తో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో క్రికెట్ ప్రియులకి ఐపీఎల్ మంచి వినోదాన్ని పంచుతుందనే విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 వేలం గత వారం ముగియగా.. ఇప్పుడు 15వ సీజన్ నిర్వహణపై బీసీసీఐ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొత్తం ఐపీఎల్ నిర్వహణ కోసం ఆరు స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం.గత రెండు సంవత్సరాలు కరోనా వలన విదేశాలలో మ్యాచ్‌లు నిర్వహించగా, ఈ సారి ఇండియాలోని ఆరు ప్రాంతాలలో జరిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. తాజా సీజన్ మార్చ్ 27, 2022న ప్రారంభం అవుతుందని సమాచారం.
ఫైనల్స్ మే 28, 2022న నిర్వహించేందుకు బోర్డు ఏర్పట్లు చేస్తోంది. ఇక ఐపీఎల్ నిర్వహణ కోసం ఆరు స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం.గత సీజన్లతో పోలిస్తే.. ఈ సారి ఐపీఎల్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ సారి ఐపీఎల్లో మొత్తం 10 టీమ్స్ పాల్గొననున్నాయి. దీనితో సీజన్ మొత్తం మీద 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 గ్రౌండ్‌లలో జరిగే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రలో లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు, ప్లేఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ముంబైలో జరిగే అన్ని మ్యాచ్‌లు వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియంలలో జరిగే అవకాశం ఉంది.
టోర్నీ షెడ్యూల్‌ను ఫిబ్రవరి చివరి వారంలో బీసీసీఐ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కరోనా తగ్గినా కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కట్టుదిట్టమైన బయోబబుల్ నిబంధనల నడుమ దేశీయంగానే ఐపీఎల్ 2022 నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దేశీయంగానే ఐపీఎల్ 2022 ఉంటుందని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. ఇతర విషయాలపై మాత్రం ఇంకా స్పందించలేదు. ఆ సారి ఐపీఎల్ మార్చి 27 నుంచి 28 వరకు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.