IPL : ఐపీఎల్ అభిమానులు ఇక ర‌చ్చ‌కు సిద్ధం కండి.. ఎప్ప‌టి నుండి మ్యాచ్‌లు షురూ కానున్నాయో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IPL : ఐపీఎల్ అభిమానులు ఇక ర‌చ్చ‌కు సిద్ధం కండి.. ఎప్ప‌టి నుండి మ్యాచ్‌లు షురూ కానున్నాయో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :20 February 2022,1:00 pm

IPL : ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో క్రికెట్ ప్రియుల‌కి ఐపీఎల్‌ మంచి వినోదాన్ని పంచుతుంద‌నే విష‌యం తెలిసిందే. ఐపీఎల్​ 2022 వేలం గత వారం ముగియగా.. ఇప్పుడు 15వ సీజన్ నిర్వహణపై బీసీసీఐ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొత్తం ఐపీఎల్​ నిర్వహణ కోసం ఆరు స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం.గ‌త రెండు సంవ‌త్స‌రాలు క‌రోనా వ‌ల‌న విదేశాల‌లో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌గా, ఈ సారి ఇండియాలోని ఆరు ప్రాంతాల‌లో జ‌రిపేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. తాజా సీజ‌న్‌ మార్చ్ 27, 2022న ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం.

ఫైన‌ల్స్ మే 28, 2022న నిర్వ‌హించేందుకు బోర్డు ఏర్ప‌ట్లు చేస్తోంది. ఇక ఐపీఎల్​ నిర్వహణ కోసం ఆరు స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం.గత సీజన్లతో పోలిస్తే.. ఈ సారి ఐపీఎల్​కు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ సారి ఐపీఎల్​లో మొత్తం 10 టీమ్స్​ పాల్గొననున్నాయి. దీనితో సీజన్​ మొత్తం మీద 74 మ్యాచ్​లు జరగనున్నాయి.అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 గ్రౌండ్‌లలో జరిగే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రలో లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు, ప్లేఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ముంబైలో జరిగే అన్ని మ్యాచ్‌లు వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియంలలో జరిగే అవకాశం ఉంది.

ipl matches starts in march

ipl matches starts in march

IPL : ఐపీఎల్ హంగామా షురూ..

టోర్నీ షెడ్యూల్‌ను ఫిబ్రవరి చివరి వారంలో బీసీసీఐ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.క‌రోనా త‌గ్గినా కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కట్టుదిట్టమైన బయోబబుల్ నిబంధనల నడుమ దేశీయంగానే ఐపీఎల్ 2022 నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దేశీయంగానే ఐపీఎల్ 2022 ఉంటుందని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. ఇతర విషయాలపై మాత్రం ఇంకా స్పందించలేదు. ఆ సారి ఐపీఎల్​ మార్చి 27 నుంచి 28 వరకు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది