Team India : మూడో వ‌న్డేలో టీమిండియాకి విల‌న్‌గా మారిన ఆ క్రికెట‌ర్..ఇక జ‌ట్టులోకి క‌ష్ట‌మే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Team India : మూడో వ‌న్డేలో టీమిండియాకి విల‌న్‌గా మారిన ఆ క్రికెట‌ర్..ఇక జ‌ట్టులోకి క‌ష్ట‌మే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 January 2022,9:00 am

Team India : సౌతాఫ్రికా టూర్‌ని భార‌త్ దారుణంగా ముగించింది. టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా క‌నీసం వ‌న్డే సిరీస్ అయిన గెలుస్తుంద‌ని అంద‌రు ఊహించారు. కాని అందులోను దారుణంగా నిరాశ‌ప‌రిచారు. వన్డే సిరీస్ లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. దక్షిణాఫ్రికా 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఓటమి టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఎందుకంటే ప్రస్తుత టీం చాలా బలమైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో సన్నద్ధమైంది. అయినప్పటికీ, భారత్ గెలవలేకపోయింది.

మూడో వన్డే లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి ఓవర్‌లో 283 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టులో దీపక్ చాహర్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి అర్ధ సెంచరీలు చేసినప్పటికీ , గెలవలేకపోయారు .అయితే ఇండియా ఇంత దారుణంగా ఓడిపోవ‌డానికి ప‌లు కార‌ణాలు చెబుతున్నారు. ముఖ్యంగా మూడో వ‌న్డేలో ఓడిపోవ‌డానికి జ‌యంత్ యాద‌వ్ ఓ కార‌ణంగా చెబుతున్నారు. అతను బ్యాట్, బాల్‌తో పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు.దాదాపు 6 ఏళ్ల త‌ర్వాత వ‌న్డేల్లో అత‌నికి ఛాన్స్ ఇవ్వగా ఏ మాత్రం చ‌రిష్మా చూపించ‌లేకపోయాడు.

jaswanth yadav villain Third odi match Ind vs SA

jaswanth yadav villain Third odi match Ind vs SA

Team India : ఇక క‌ష్ట‌మే..

రిషబ్ పంత్ రాంగ్ టైమ్‌లో చాలా బాధ్యతారహిత్యమైన షాట్లు ఆడుతూ వికెట్ కోల్పోయాడు. శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ కూడా ఇలానే చేసి నిరాశ పరిచారు.ఇది కూడా భార‌త జ‌ట్టు ఓట‌మికి కార‌ణంగా మారింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెఎల్ రాహుల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్సీని నిరూపించుకుంటాడు అనుకుంటే కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. విరాట్, రోహిత్‌లా ఆకట్టుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా ఎనర్జీ చాలా తక్కువగా కనిపించింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది