Cricket Stadium : ఇండియా మ్యాచ్‌లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cricket Stadium : ఇండియా మ్యాచ్‌లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..!

Cricket Stadium : ప్ర‌స్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. జూన్2న ఈ టోర్న‌మెంట్ మొద‌లు కాగా, ప్ర‌తి మ్యాచ్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగుతూ వ‌చ్చింది. కొన్ని టీమ్స్ ఇప్పటికే సూప‌ర్‌8కి చేరుకోగా, మ‌రి కొన్ని రేసులో నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ టీ20 ప్ర‌పంచ క‌ప్ గురించి మాట్లాడుకుంటే అందరికి డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారుతుంది నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్. ఈ స్టేడియంలో ఇప్ప‌టి వ‌ర‌కు […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2024,5:00 pm

Cricket Stadium : ప్ర‌స్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. జూన్2న ఈ టోర్న‌మెంట్ మొద‌లు కాగా, ప్ర‌తి మ్యాచ్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగుతూ వ‌చ్చింది. కొన్ని టీమ్స్ ఇప్పటికే సూప‌ర్‌8కి చేరుకోగా, మ‌రి కొన్ని రేసులో నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ టీ20 ప్ర‌పంచ క‌ప్ గురించి మాట్లాడుకుంటే అందరికి డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారుతుంది నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్. ఈ స్టేడియంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని మ్యాచ్‌ల‌లో చాలా లోస్కోర్ టోటల్స్ న‌మోద‌య్యాయి. క్రికెట్ దిగ్గజాలు, హేమాహేమీలకు కూడా ఆ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తుందా? బౌలింగ్ కి సహకరిస్తుందా? ఎలాంటి సమయంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అనే విషయాన్ని కూడా నిపుణులు అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు.

Cricket Stadium : స్టేడియం కూల్చివేత‌..

ఈ స్టేడియంలో మ‌హామ‌హా టీమ్స్ క్రికెట్ ఆడ‌గా, అవి కూడా చాలా స్కోరు టోట‌ల్ చేశాయి. క‌నీసం 150 ప‌రుగులు కూడా స‌ద‌రు టీమ్స్ చేయ‌లేక‌పోతుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి క‌లిగిస్తుంది. ఈ నస్సావ్ కౌంటీ న్యూయార్క్ స్టేడియంని కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారు. ఆ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు, అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అంతేకాకుండా.. ఈ స్టేడియం నిర్మాణం కోసం ఏకంగా రూ.250 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ప్రతి విషయంలో ఈ స్టేడియం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా నిలిచింది. ఈ స్టేడియంపై బాగా నెగెటివిటీ పెర‌గ‌డంతో ఈ స్టేడియాన్ని కూల్చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

Cricket Stadium ఇండియా మ్యాచ్‌లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారురూ250 కోట్లు వృధా

Cricket Stadium : ఇండియా మ్యాచ్‌లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..!

రూ.250 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన స్టేడియాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్ప‌న్నం కాగా, అందుకు కార‌ణంగా ఆ స్టేడియం వ‌చ్చిన నెగెటివిటీనే కార‌ణంగా చెబుతున్నారు. పిచ్‌ని మార్చుకోవ‌డానికి వీలు ఉంటుంది. కాని ఔట్ ఫీల్డ్ కూడా చాలా మంద‌కొడిగా ఉండ‌డంతో స్టేడియం మొత్తాన్ని మార్చడం కష్టం కాబట్టి.. కూల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో కేవలం టీమిండియా- పాక్ మ్యాచ్ కే రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని కాబ‌ట్టి వారికి ఎలాంటి న‌ష్టాలు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో మ‌రి..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది