
Cricket Stadium : ఇండియా మ్యాచ్‌లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..!
Cricket Stadium : ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్2న ఈ టోర్నమెంట్ మొదలు కాగా, ప్రతి మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. కొన్ని టీమ్స్ ఇప్పటికే సూపర్8కి చేరుకోగా, మరి కొన్ని రేసులో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుకుంటే అందరికి డిస్కషన్ పాయింట్‌గా మారుతుంది నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో చాలా లోస్కోర్ టోటల్స్ నమోదయ్యాయి. క్రికెట్ దిగ్గజాలు, హేమాహేమీలకు కూడా ఆ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తుందా? బౌలింగ్ కి సహకరిస్తుందా? ఎలాంటి సమయంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అనే విషయాన్ని కూడా నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు.
ఈ స్టేడియంలో మహామహా టీమ్స్ క్రికెట్ ఆడగా, అవి కూడా చాలా స్కోరు టోటల్ చేశాయి. కనీసం 150 పరుగులు కూడా సదరు టీమ్స్ చేయలేకపోతుండడం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఈ నస్సావ్ కౌంటీ న్యూయార్క్ స్టేడియంని కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారు. ఆ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు, అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అంతేకాకుండా.. ఈ స్టేడియం నిర్మాణం కోసం ఏకంగా రూ.250 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ప్రతి విషయంలో ఈ స్టేడియం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా నిలిచింది. ఈ స్టేడియంపై బాగా నెగెటివిటీ పెరగడంతో ఈ స్టేడియాన్ని కూల్చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
Cricket Stadium : ఇండియా మ్యాచ్‌లు ఆడిన స్టేడియాన్ని కూల్చేస్తున్నారు..రూ.250 కోట్లు వృధా..!
రూ.250 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన స్టేడియాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నం కాగా, అందుకు కారణంగా ఆ స్టేడియం వచ్చిన నెగెటివిటీనే కారణంగా చెబుతున్నారు. పిచ్‌ని మార్చుకోవడానికి వీలు ఉంటుంది. కాని ఔట్ ఫీల్డ్ కూడా చాలా మందకొడిగా ఉండడంతో స్టేడియం మొత్తాన్ని మార్చడం కష్టం కాబట్టి.. కూల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో కేవలం టీమిండియా- పాక్ మ్యాచ్ కే రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని కాబట్టి వారికి ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.చూడాలి మరి రానున్న రోజులలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మరి..
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
This website uses cookies.