BCCI : అంబ‌టి రాయ‌డు మాదిరిగానే ఆ క్రికెట‌ర్‌కి అన్యాయం.. ఏం సెల‌క్ష‌న్ అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BCCI : అంబ‌టి రాయ‌డు మాదిరిగానే ఆ క్రికెట‌ర్‌కి అన్యాయం.. ఏం సెల‌క్ష‌న్ అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  BCCI : అంబ‌టి రాయ‌డు మాదిరిగానే ఆ క్రికెట‌ర్‌కి అన్యాయం.. ఏం సెల‌క్ష‌న్ అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్

BCCI : గ‌త కొద్ది రోజులుగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ స్క్వాడ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 30న భార‌త జ‌ట్టుని ప్ర‌క‌టించింది బీసీసీఐ. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలు ప్ర‌క‌టించ‌గా, ఈ లిస్ట్ చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. ముందు ఊహించిన‌ట్టే ఎలాంటి సంచ‌ల‌నాల‌కి తావివ్వ‌లేదు. కోహ్లీ ఉండ‌డ‌ని ముందు అనుకున్నారు. కాని అత‌నికి ఛాన్స్ ఇచ్చారు. ఇక రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ చాలా రోజుల త‌ర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక రెండో వికెట్ కీప‌ర్‌గా సంజూ శాంస‌న్‌ని ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టింది. తుది జట్టులో ఉంటారని భావించిన శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లను స్టాండ్ బై లిస్ట్‌లో చేర్చింది. మే 15లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.

BCCI : ఇదేం సెల‌క్ష‌న్ రా బాబు

అయితే బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు తెలియ‌జేస్తున్నారు. నిలకడగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్‌, రింకూ సింగ్‌ల‌ని ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. రింకూ సింగ్‌కి టీ20లో అద్భుత‌మైన రికార్డ్ ఉంది. అత‌నిని ఎందుకు ఎంపిక చేయ‌లేదంటూ మండిప‌డుతున్నారు.రాయుడు ప‌రిస్థితి రింకూకి వ‌చ్చిందా అంటూ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అప్పట్లో రాయుడిని ఏడాది మొత్తం భారత జట్టులో నాలుగో స్థానంలో ఆడించి.. ఐపీఎల్ 2019‌లో విఫలమయ్యాడని 2019 ప్రపంచకప్ జట్టులో చోటివ్వలేదు. ఆయ‌న స్థానంలో విజ‌య్ శంక‌ర్‌ని తీసుకున్నారు.

BCCI అంబ‌టి రాయ‌డు మాదిరిగానే ఆ క్రికెట‌ర్‌కి అన్యాయం ఏం సెల‌క్ష‌న్ అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్

BCCI : అంబ‌టి రాయ‌డు మాదిరిగానే ఆ క్రికెట‌ర్‌కి అన్యాయం.. ఏం సెల‌క్ష‌న్ అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్

ఇప్పుడు రింకూ సింగ్ ప‌రిస్థితి కూడా అలానే ఉంది.ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన రింకూ సింగ్.. 12 మ్యాచ్‌ల్లో 262 పరుగులలు చేశాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 123 పరుగులే చేశాడు.ఈ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగానే అత‌నిని ప‌క్క‌న పెట్టిన‌ట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్‌ ఎంపికకాకపోవడానికి ప్రధాన కారణం రాహుల్ ద్రవిడేనని ఆరోపిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది