Pakistan Fan : వీడి అభిమానం తగలెయ్యా.. ట్రాక్టర్ అమ్మి టిక్కెట్ కొన్నాడట.. తమ జట్టు ఓడిపోవడంతో..!
ప్రధానాంశాలు:
Pakistan Fan : వీడి అభిమానం తగలెయ్యా.. ట్రాక్టర్ అమ్మి టిక్కెట్ కొన్నాడట.. తమ జట్టు ఓడిపోవడంతో..!
Pakistan Fan : ఇటీవల చాలా మందికి క్రికెట్ వ్యసనంలా మారింది. క్రికెట్ కోసం ఏం చేయడానికైన సిద్ధపడుతున్నారు. ఇటీవల జరిగిన భారత్ -పాక్ మ్యాచ్ కోసం అయితే లక్షలు ఖర్చు చేసి మరీ టిక్కెట్ కొనుక్కొని వెళ్లి మ్యాచ్‌లు చూశారు. లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగులు తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. కాగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా, అభిమానులు స్టేడియంలో కిక్కిరిసిపోయారు. భారత్, పాక్ లకు చెందిన వేలాది మంది ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. ఇలా వెళ్లిపోయిన పాకిస్థాన్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
Pakistan Fan ఇదేం క్రికెట్ పిచ్చి..
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు టీమిండియా చేతిలో ఏడోసారి ఓడిపోవడంతో పాక్ జట్టుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఓటమి తర్వాత ఓ పాక్ అభిమాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ చూసేందుకు ఒక పాక్ అభిమాని ఏకంగా తన ట్రాక్టర్ అమ్మేసి న్యూయార్క్ వచ్చాడు. 3000 డాలర్ల విలువైన టికెట్ కూడా కొన్నాడు. అంటే ఈ టికెట్ విలువ పాక్ కరెన్సీలో సుమారు రూ.8 లక్షలు కాగా అదే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 2.50 లక్షలు. ఖరీదైన టికెట్ కొని మ్యాచ్ వీక్షించిన అభిమాని ఈ సారైన పాక్ గెలుస్తుందని అనుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ జట్టు విజయం ఖాయమని సదరు అభిమాని భావించారు.
కానీ టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు మోకరిల్లారు. ఈ ఓటమి బాధ గురించి పాక్ అభిమాని మాట్లాడుతూ, “నేను US $ 3000 విలువైన టికెట్ కొనడానికి నా ట్రాక్టర్‌ని అమ్మాను. భారత జట్టు స్కోరు చూస్తుంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోతామని అనుకోలేదు. మ్యాచ్ మొత్తం మా చేతుల్లోనే ఉంది. కానీ బాబర్ అజామ్ ఔట్ అయిన తర్వాత ప్రజలు నిరాశ చెందారు.. భారతీయులకి నేను అభినందనలు తెలుపుతున్నాను అని పాకిస్థాన్ అభిమాని భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంత పని చేశావురయ్యా.. మరీ అంత పిచ్చి ఏంట్రా అంటూ మనోడిని తిట్టి పోస్తున్నారు.