IND VS ENG : భారత్ గెలిచినందుకు సంబురాలు చేసుకున్న పాకిస్థాన్.. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IND VS ENG : భారత్ గెలిచినందుకు సంబురాలు చేసుకున్న పాకిస్థాన్.. ఎందుకో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :30 October 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  ఇంగ్లండ్ సెమీస్ ఆశలకు భారత్ సమాధి

  •  సెమీస్ లోకి పాకిస్థాన్ కు ఆశలు

  •  ఇంగ్లండ్ ను భారత్ ఓడించడంతో పాకిస్థాన్ కు చాన్స్

IND VS ENG : వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఎదురులేని భారత్ గా అవిర్భవించింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ గెలిచి సత్తా చాటింది. పాకిస్థాన్ తో మ్యాచ్ తర్వాత నుంచి భారత్ పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంటోంది. సొంత గడ్డపై భారత్ ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ఈసారి వరల్డ్ కప్ గెలిచి తీరుతాం అని ప్రపంచ దేశాలకు భారత్ సవాల్ విసిరింది. ఇక.. నిన్న జరిగిన భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ లోనూ భారత్ మరోసారి గెలిచి సత్తా చాటింది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో భారత్ అదరగొట్టేసింది. 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయం చూసి భారత్ మాత్రమే కాదు.. పాకిస్తాన్ కూడా సంబురాలు చేసుకుంది. భారత్ గెలుపుపై బీభత్సంగా జనాలు సంబురాలు చేసుకుంటుంటే.. టీమిండియాకు పాకిస్థాన్ మాత్రం ప్రత్యేకంగా థాంక్స్ చెప్పినంత పని చేసింది. భారత్ లో కంటే పాకిస్థాన్ లోనే సంబురాలు ఎక్కువగా చేసుకున్నారు.

అసలు టీమిండియా గెలిస్తే పాకిస్థాన్ కు ఏంటి లాభం అంటారా? అక్కడే ఉంది తిరకాసు. ఎందుకంటే.. ఇంగ్లండ్ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాలి కదా. ఆ మూడు మ్యాచ్ లు గెలిచినా కూడా టీమ్ కు 8 పాయింట్లు వస్తాయి. ఇప్పటికే భారత్ తో ఓడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. ఇప్పటికే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోవడంతో అది పాకిస్థాన్ కు ప్లస్ కానుంది. భారత్ తో ఓడిపోవడం వల్ల సెమీ ఫైనల్స్ రేసు నుంచి ఇంగ్లండ్ తప్పుకున్నట్టే అని చెప్పుకోవాలి. ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా సెమీస్ కోసం పోటీ పడుతుండగా.. భారత్ చేతిలో ఓడిపోవడంతో ఇంగ్లండ్ కు ఆశలు గల్లంతు అయ్యాయనే చెప్పుకోవాలి.

IND VS ENG : పాకిస్థాన్ కు ఆశలు

ఒకవేళ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఈ రెండింట్లో పాకిస్థాన్ కు చాన్స్ ఉంది. ఇంకా మూడు మ్యాచ్ లు పాక్ ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ లను పాక్ గెలిస్తే 10 పాయింట్లు ఖచ్చితంగా సాధిస్తుంది. అంటే.. ఇంగ్లండ్ కంటే ఎక్కువ పాయింట్లు సాధించి సెమీస్ కు చేరే అవకాశం ఉంది. అందుకే.. ఇంగ్లండ్ ను ఓడించిన భారత్ కు పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ధన్యవాదాలు తెలుపుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది