
Rohit Sharma : గ్రౌండ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ అభిమానిని ఓ రేంజ్‌లో చితకబాదిన యూఎస్ పోలీసులు
Rohit Sharma : క్రికెట్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న మహా సంగ్రామం టీ20 ప్రపంచకప్ 2024 నేటి నుండి ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ క్రికెట్ సమరం సాగనుంది. జూన్ 29వ తేదీన వరకు ప్రపంచకప్ జరగనుంది. నేడు (జూన్ 2) అమెరికా, కెనడా మధ్య డల్లాస్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‍తో టీ20 ప్రపంచ సమరం షురూ కానుంది. ఈ టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. అయితే నిన్న భారత్ బంగ్లా మధ్య వార్మప్ మ్యాచ్ జరగగా, ఆ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. న్యూయార్క్ వేదికగా నేడు (జూన్ 1) జరిగిన టీ20 ప్రపంచకప్ వామప్ మ్యాచ్‍లో భారత్ 60 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. అసలు పోరుకు ముందు సన్నాహక మ్యాచ్‍లో రోహిత్ శర్మ సేన అదరగొట్టింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై బ్యాటింగ్‍లో దుమ్మురేపింది. ఓపెనింగ్‍కు వచ్చిన సంజూ శాంసన్ (1) ఫెయిల్ అవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (23) కాసేపు నిలిచాడు. రిషబ్ పంత్ ఈ మ్యాచ్‍లో దుమ్మురేపాడు. 32 బంతుల్లోనే 53 పరుగులు బాది అర్ధ శతకంతో మెరిపించాడు. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో దుమ్మురేపాడు. సూర్య కుమార్ యాదవ్ (18 బంతుల్లో 31 పరుగులు) వేగంగా ఆడాడు. అయితే, శివమ్ దూబే 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 పరుగులు నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హిట్టింగ్‍తో అదరగొట్టాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో 183 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Rohit Sharma : గ్రౌండ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ అభిమానిని ఓ రేంజ్‌లో చితకబాదిన యూఎస్ పోలీసులు
అయితే మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని రోహిత్ ని హగ్ చేసుకోగా, పోలీసులు వచ్చి సదరు అభిమానిని నేలపై పడుకోబెట్టి చావాబాదారు. రోహిత్ శర్మ వద్దని చెబుతున్నా.. అమెరికా పోలీసులు వినిపించుకోలేదు. చివరకు మ్యాచ్ నిర్వాహకుల్లోని ఒకరు వచ్చి రోహిత్ రిక్వెస్ట్‌ను పోలీసులకు తెలియజేయడంతో మైదానం బయటకు తీసుకెళ్లారు. సదరు అభిమానిని రక్షించేందుకు రోహిత్ శర్మ చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.