Exit Polls : జూన్ 1 వరకు దేశంలోని పలు ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. జూన్4న ఫలితాలు బయటకి రానుండగా, ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు.. వారం రోజుల గ్యాప్ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ సాగింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ బయటకు రాగా, ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో దాదాపు ఎవరు విజయం సాధిస్తారనేది తేలుతుంది. వాస్తవ ఫలితాలకు, ఎగ్జిట్ పోల్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ.. ఎవరిది పైచేయి ఉంటుందనే విషయం మాత్రం ఎగ్జిట్ పోల్స్‌తో దాదాపు తేలిపోతుంది.
ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు.. ఓటర్లు ఓటు వేసిన వెంటనే వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఓటర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేస్తారు. దీనినే ఎగ్జిట్ పోల్స్ అంటారు. నిజానికి.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో.. ఈ ఎగ్జిట్ పోల్స్‌ని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ని రిలీజ్ చేయవచ్చు. ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతుంటాయి. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో కొత్త చర్చ నడుస్తుంది. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ఈసారి వెల్లడయ్యాయని మాట వినిపిస్తోంది. అందుకు కారణం ఎగ్జిట్ పోల్స్‌లో కనిపిస్తున్న వైరుధ్యం.
మరో రెండు రోజుల్లో రిజల్ట్స్ బయటకు రానున్న వేళ.. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ అవసరమేంటి? అన్నది ప్రశ్నగా మారింది. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ కాన్సెప్టు ఎందుకు షురూ అయ్యిందన్న ప్రశ్నకు కొందరు బదులిస్తూ.. ఎగ్జిట్ పోల్స్ తో తాము సమర్థించే పార్టీ క్యాడర్ కు మనోధైర్యాన్ని కల్పించటం.. కీలకమైన ఓట్ల లెక్కింపు వేళ.. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వారు మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేందుకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టానిక్ మాదిరి పని చేస్తాయని కొందరు చెప్పుకొస్తున్న మాట. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే క్యాడర్ లో ధైర్యం నింపేందుకు వీలుగా ఈ మైండ్ గేమ్ కు తెర తీసినట్లుగా చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే నిలదీయటం ఉండదు. కాబట్టి ఎవరు ఏది చెప్పిన నడుస్తుంది అనేలా ఈ పోల్స్ రిలీజ్ చేశారు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.