RCB : గెలిచిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే ఆ ఛాన్స్ ఒక్కటి మాత్రమే ఉంది..!
ప్రధానాంశాలు:
RCB : గెలిచిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే ఆ ఛాన్స్ ఒక్కటి మాత్రమే ఉంది..!
RCB : ఐపీఎల్ నుండి ఒక్కో జట్టు పక్కకు తప్పుకుంటున్నాయి. లక్నోపై ఎస్ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ సాధించడంతో ముంబై అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమించినట్టైంది. ఇక గత రాత్రి పంజాబ్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగగా ఆ మ్యాచ్‌లో పంజాబ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా ముంబై ఇండియన్స్‌తో జతకట్టింది పంజాబ్ జట్టు. ఇక ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. గళూరు తర్వాతి రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనుండగా, ఈ రెండు జట్లూ ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి.
RCB : ఎలిమినేషన్ టైం..
కాబట్టి ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో టాప్ -2 లో ఉన్న ఇరు జట్లకు 16 పాయింట్లు ఉండగా, మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు 14 పాయింట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో ఉంది. కాబట్టి రెండు జట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగళూరు రెండు మ్యాచ్‌లు గెలిస్తే 14 పాయింట్లు, ప్లేఆఫ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ ముందు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో, 7×4, 6×6) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3×4, 6×6), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5×4, 1×6) మంచి ఇన్నింగ్స్ ఆడారు.
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ చతికిలపడింది.17 ఓవర్లలో 181 పరుగులకు కుప్పకూలింది. రొసో (61; 27 బంతుల్లో, 9×4, 3×6) ఒంటరి పోరాటం చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ (3/43) మూడు వికెట్లు, స్వప్నిల్ సింగ్ (2/28), ఫెర్గూసన్ (2/29), కర్ణ్ శర్మ (2/36) తలో రెండు వికెట్లు తీసి పంజాబ్ ఖాతాలో విజయం చేరకుండా చేశారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్స్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (6; 4 బంతుల్లో, 1×6), శశాంక్ (37), బెయిర్ స్టో (27), సామ్ కరన్ (22) పరుగులు చేశారు. 10 ఓవర్లకి వీరి స్కోరు బాగానే ఉంది. వికెట్లు చేతిలో ఉన్నాయి. కాని 56 పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.