Yash Dayal | లైంగిక వేధింపుల కేసులో క్రికెటర్ యశ్ దయాల్.. నేడు తీర్పు.. అరెస్ట్ తప్పదా?
Yash Dayal |జాతీయ క్రికెటర్ యశ్ దయాల్ ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఈ కేసు ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు ముందున్నది. ఈరోజు (ఆగస్టు 21) జరగనున్న విచారణలో ఆయన అరెస్ట్‌పై ఉన్న స్టే కొనసాగుతుందా, లేదా తదుపరి దశలో ఏ మేరకు కేసు ముందుకు వెళ్తుందా అన్నది తేలనుంది.

#image_title
తాత్కాలిక ఊరట ఇచ్చిన హైకోర్టు
జూలై 15న అలహాబాద్ హైకోర్టు యశ్ దయాల్‌కు తాత్కాలిక ఊరట ఇచ్చింది. కేసుపై పూర్తి విచారణ ముగిసే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బాధిత మహిళ, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పోలీస్ స్టేషన్‌కు నోటీసులు జారీ చేసింది.జులై 6న ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో యశ్ దయాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. కేసు నమోదు తర్వాత దయాల్ హైకోర్టును ఆశ్రయించి, తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
దయాల్ తరఫు వాదన ప్రకారం, తన పేరును పాడు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు వచ్చాయని, ఇది పూర్తిగా కుట్రగా భావించవచ్చని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ విచారిస్తోంది. జస్టిస్ సిద్ధార్థ వర్మ మరియు జస్టిస్ అబ్దుల్ షాహిద్లతో కూడిన బెంచ్ ఈ కేసుపై తుది నిర్ణయం తీసుకోనుంది.