India vs Australia : అయ్యో.. ఈసారి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మనదే అని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఓవైపు సంబురాలు చేసుకుంటూ ఉంటే.. మరోవైపు ఫైనల్ మ్యాచ్ ఇంకా జరగకముందే పెద్ద బాంబు పేలినంత పని అయింది. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ బిగ్ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆ షాకింగ్ ఏంటో తెలుసా? అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. వామ్మో.. ఈయన పేరు ఎత్తితేనే భారత క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్వెత్తున లేస్తారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ అంపైర్ భారత్ కు శని అనే చెప్పుకోవాలి. ఆయన అంపైర్ గా ఉన్న ఏ ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ భారత్ గెలవలేదు. ఇప్పటి వరకు అలాంటి దాఖలాలే లేవు. కానీ.. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరగబోయే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆన్ ఫీల్డ్ అంపైర్స్ గా ఈ రిచర్డ్ కెటిల్ బరో, రిచర్ ఇల్లింగ్ వర్త్ ను కన్ఫమ్ చేశారు. 2015 వరల్డ్ కప్ ఫైనల్ లోనూ కెటిల్ బరోనే అంపైర్ గా ఉన్నాడు.
ఆన్ ఫీల్డ్ లో వీళ్లు అంపైర్స్ కాగా, థర్డ్ అంపైర్ గా జొయెల్ విల్సన్, నాలుగో అంపైర్ గా క్రిస్ గఫ్పనే(న్యూజిలాండ్), మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(జింబాబ్వే) ఉండనున్నారు. వీళ్లంతా సెమీ ఫైనల్స్ లోనూ అంపైర్స్ గా వ్యవహరించారు. ఫైనల్ మ్యాచ్ కోసం ఈ అంపైర్స్ ను తాజాగా ఐసీసీ సెలెక్ట్ చేసింది. న్యూజిలాండ్ తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడినప్పుడు ఇల్లింగ్ వర్త్ అంపైర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్ మ్యాచ్ కు కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు ఇద్దరిని ఆన్ ఫీల్డ్ అంపైర్స్ గా ఐసీసీ నియమించింది. అయితే.. భారత్ కు శనిగా పట్టుకున్న రిచర్డ్ కెటిల్ బరో ఫైనల్ కు అంపైర్ అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్.. కెటిల్ బరో అంపైర్ గా ఉన్నప్పుడే ఓడిపోయింది. అంతే కాదు.. 2014 వరల్డ్ కప్ టీ20 ఫైనల్ మ్యాచ్ లోనూ కెటిల్ బరోనే అంపైర్. ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయింది. 2016 వరల్డ్ కప్ టీ20 సెమీ ఫైనల్, 2017 సీటీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లన్నీంటికీ కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు కూడా ఈయనే సెలెక్ట్ అవడంతో ఫైనల్ మ్యాచ్ ఏమౌతుందో అని అంతా టెన్షన్ గా చూస్తున్నారు. భారత్ కు ఐరన్ లెగ్ అంపైర్ గా పేరు తెచ్చుకున్న ఈయన్ను ఎందుకు ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్ గా సెలెక్ట్ చేసిందో.. ఈయన వల్ల ఈ సారి కప్పు చేజారుతుందా? లేక.. ఆ శనిదేవుడి సెంటిమెంట్ ను ఈసారి భారత్ పక్కన పెడుతుందా? అనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.