India vs Australia : వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు భార‌త్‌కు బిగ్ షాకింగ్ న్యూస్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

India vs Australia : వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు భార‌త్‌కు బిగ్ షాకింగ్ న్యూస్‌..!

India vs Australia : అయ్యో.. ఈసారి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మనదే అని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఓవైపు సంబురాలు చేసుకుంటూ ఉంటే.. మరోవైపు ఫైనల్ మ్యాచ్ ఇంకా జరగకముందే పెద్ద బాంబు పేలినంత పని అయింది. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ బిగ్ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆ షాకింగ్ ఏంటో తెలుసా? అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. వామ్మో.. ఈయన పేరు ఎత్తితేనే భారత క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్వెత్తున లేస్తారు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :17 November 2023,10:35 pm

ప్రధానాంశాలు:

  •  భారత్ కు ఐరన్ లెగ్ అంపైర్ ఈ రిచర్డ్ కెటిల్ బరో

  •  మళ్లీ అదే సెంటిమెంట్ పని చేస్తుందా?

  •  టెన్షన్ లో భారత క్రికెట్ ఫ్యాన్స్

India vs Australia : అయ్యో.. ఈసారి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మనదే అని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఓవైపు సంబురాలు చేసుకుంటూ ఉంటే.. మరోవైపు ఫైనల్ మ్యాచ్ ఇంకా జరగకముందే పెద్ద బాంబు పేలినంత పని అయింది. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ బిగ్ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆ షాకింగ్ ఏంటో తెలుసా? అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. వామ్మో.. ఈయన పేరు ఎత్తితేనే భారత క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్వెత్తున లేస్తారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ అంపైర్ భారత్ కు శని అనే చెప్పుకోవాలి. ఆయన అంపైర్ గా ఉన్న ఏ ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ భారత్ గెలవలేదు. ఇప్పటి వరకు అలాంటి దాఖలాలే లేవు. కానీ.. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరగబోయే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆన్ ఫీల్డ్ అంపైర్స్ గా ఈ రిచర్డ్ కెటిల్ బరో, రిచర్ ఇల్లింగ్ వర్త్ ను కన్ఫమ్ చేశారు. 2015 వరల్డ్ కప్ ఫైనల్ లోనూ కెటిల్ బరోనే అంపైర్ గా ఉన్నాడు.

ఆన్ ఫీల్డ్ లో వీళ్లు అంపైర్స్ కాగా, థర్డ్ అంపైర్ గా జొయెల్ విల్సన్, నాలుగో అంపైర్ గా క్రిస్ గఫ్పనే(న్యూజిలాండ్), మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(జింబాబ్వే) ఉండనున్నారు. వీళ్లంతా సెమీ ఫైనల్స్ లోనూ అంపైర్స్ గా వ్యవహరించారు. ఫైనల్ మ్యాచ్ కోసం ఈ అంపైర్స్ ను తాజాగా ఐసీసీ సెలెక్ట్ చేసింది. న్యూజిలాండ్ తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడినప్పుడు ఇల్లింగ్ వర్త్ అంపైర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్ మ్యాచ్ కు కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు ఇద్దరిని ఆన్ ఫీల్డ్ అంపైర్స్ గా ఐసీసీ నియమించింది. అయితే.. భారత్ కు శనిగా పట్టుకున్న రిచర్డ్ కెటిల్ బరో ఫైనల్ కు అంపైర్ అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

India vs Australia : 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఓడిన భారత్

2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్.. కెటిల్ బరో అంపైర్ గా ఉన్నప్పుడే ఓడిపోయింది. అంతే కాదు.. 2014 వరల్డ్ కప్ టీ20 ఫైనల్ మ్యాచ్ లోనూ కెటిల్ బరోనే అంపైర్. ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయింది. 2016 వరల్డ్ కప్ టీ20 సెమీ ఫైనల్, 2017 సీటీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లన్నీంటికీ కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కు కూడా ఈయనే సెలెక్ట్ అవడంతో ఫైనల్ మ్యాచ్ ఏమౌతుందో అని అంతా టెన్షన్ గా చూస్తున్నారు. భారత్ కు ఐరన్ లెగ్ అంపైర్ గా పేరు తెచ్చుకున్న ఈయన్ను ఎందుకు ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్ గా సెలెక్ట్ చేసిందో.. ఈయన వల్ల ఈ సారి కప్పు చేజారుతుందా? లేక.. ఆ శనిదేవుడి సెంటిమెంట్ ను ఈసారి భారత్ పక్కన పెడుతుందా? అనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది