T20 World Cup : గిల్‌, పాండ్యాకి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నో ఛాన్స్.. వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త క్రికెట్ జ‌ట్టు ఇదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

T20 World Cup : గిల్‌, పాండ్యాకి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నో ఛాన్స్.. వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త క్రికెట్ జ‌ట్టు ఇదేనా..?

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  T20 World Cup : గిల్‌, పాండ్యాకి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నో ఛాన్స్.. వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త క్రికెట్ జ‌ట్టు ఇదే..!

T20 World Cup : ప్ర‌స్తుతం ఐపీఎల్ మ్యాచ్ రంజుగా సాగుతుంది.ఈ సారి ఎవ‌రు క‌ప్ కొడ‌తారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఐపీఎల్ త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మరం మొద‌లు కానుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు టైటిల్ కోసం పోటీపడనుండ‌గా, ఈ టోర్నీ కోసం మే 1న టీమ్ ఇండియాను ఎంపిక చేయనున్నారు. అయితే భారత జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ తిక‌మ‌క ప‌డుతుంది. ఎవ‌రిని ఎంపిక చేయాలి, ఎవరిని ప‌క్క‌న పెట్టాల‌ని చాలా ఆలోచిస్తుంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయంలో ఏం చేయాలో బోర్డుకు తెలియడం లేదు.టీ 20 ప్రపంచ కప్ లో భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి రిషబ్ పంత్‌కు సెలక్షన్ కమిటీ అప్పగించే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది.

T20 World Cup : ఎవ‌రు సెల‌క్ట్ అవుతారు

గతంలో రిషభ్ పంత్ టీమిండియా సారథిగా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఓవరాల్‌గా టీ20 ప్రపంచ కప్ లో రిషబ్ పంత్ వికెట్ కీపర్ తో పాటు కెప్టెన్ గా కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ.. టీ20 ప్రపంచకప్‌ ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలే ఢిల్లీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమై తుది జట్టు ఎంపికపై సుదీర్ఘ చర్చలు చేసింది.యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు తెలుగు తేజం తిలక్ వర్మకు సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించినట్లు తెలుస్తోంది. టాపార్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం.

T20 World Cup గిల్‌ పాండ్యాకి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నో ఛాన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త క్రికెట్ జ‌ట్టు ఇదేనా

T20 World Cup : గిల్‌, పాండ్యాకి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నో ఛాన్స్.. వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త క్రికెట్ జ‌ట్టు ఇదేనా..?

వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, రిషభ్ పంత్‌ను ఎంపిక చేశారని, ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను పరిగణించనున్నారని తెలుస్తోంది. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే ఆడనుండగా.. స్పెషలిస్ట్ ఫినిషర్‌గా రింకూ సింగ్ ఎంపికైనట్లు సమాచారం.స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు యుజ్వేంద్ర చాహల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా కొనసాగనుండగా.. మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్‌ల మధ్య పోటీ నెలకొంది. రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, కేఎల్ రాహుల్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది