#image_title
Rohit Sharma : ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా నిన్న పూణే స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యాకు గాయం అయిన విషయం తెలిసిందే కదా. బౌలింగ్ వేస్తుండగానే మూడు బంతులు వేసిన తర్వాత బాల్ ను కుడికాలుతో ఆపబోయి ఎడమ కాలు మీద పడటంతో ఆయన కాలు మణికట్టు కాస్త బెణికింది. దీంతో హార్దిక్ పాండ్యా కాస్త అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే పాండ్యాను స్కానింగ్ కోసం బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ మ్యాచ్ ను పాండ్యా కంటిన్యూ చేయలేకపోయాడు. మిగితా మూడు బంతులు కూడా పేసర్ విరాట్ కోహ్లీ వేశాడు. సడెన్ గా విరాట్ కోహ్లీ బౌలర్ గా మారడంతో ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ గెలుపొందడం పక్కన పెడితే.. హార్ధిక్ పాండ్యాకు ఏం జరిగింది. అంతా ఓకేనా.. నెక్స్ట్ మ్యాచ్ లకు వస్తాడా.. రాడా అని సగటు క్రికెట్ అభిమాని తెగ టెన్షన్ పడ్డాడు.
కానీ.. హార్దిక్ గాయంపై రోహిత్ శర్మ అప్ డేట్ ఇచ్చాడు. హార్దిక్ కొంచెం నొప్పితో బాధపడుతున్న విషయం నిజమే కానీ.. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. టీమిండియా అదృష్టం అది. పాండ్యాకు అంత పెద్ద గాయం కాలేదు. నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎలా పాండ్యాను సిద్ధం చేయాలో బీసీసీఐ ఆలోచిస్తుంది. గాయం నేపథ్యంలో పాండ్యా తదుపరి మ్యాచ్ కోసం ఎలా ముందుకెళ్లారో చూస్తాం… అని రోహిత్ స్పష్టం చేశాడు. అంటే.. పాండ్యాకు పెద్ద గాయమేమీ కాలేదన్నమాట. అంటే వచ్చే మ్యాచ్ లో ఖచ్చితంగా పాండ్యా ఉంటాడని అనుకోవాలి.
మరోవైపు ఈ వరల్డ్ కప్ లో టీమిండియా టాప్ ప్లేస్ కి ఎగబాకింది. పాకిస్థాన్ తో మ్యాచ్ కంటే ముందు ఇండియా మూడో స్థానంలో ఉండేది. పాక్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత 6 పాయింట్లతో టాప్ ప్లేస్ కు వెళ్లింది. ఇప్పుడు ఏకంగా మరో 2 పాయింట్లు పెంచుకొని తన టాప్ స్థానాన్ని పదిలపరుచుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి సొంత గడ్డ మీద టీమిండియా దూకుడు మీదుంది. ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.