Rohit Sharma : హార్దిక్ పాండ్యా గాయంపై కీలక అప్ డేట్.. వరల్డ్ కప్‌లో ఉన్నట్టా.. లేనట్టా.. రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rohit Sharma : హార్దిక్ పాండ్యా గాయంపై కీలక అప్ డేట్.. వరల్డ్ కప్‌లో ఉన్నట్టా.. లేనట్టా.. రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే?

Rohit Sharma : ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా నిన్న పూణే స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యాకు గాయం అయిన విషయం తెలిసిందే కదా. బౌలింగ్ వేస్తుండగానే మూడు బంతులు వేసిన తర్వాత బాల్ ను కుడికాలుతో ఆపబోయి ఎడమ కాలు మీద పడటంతో ఆయన కాలు మణికట్టు కాస్త బెణికింది. దీంతో హార్దిక్ పాండ్యా కాస్త అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే పాండ్యాను స్కానింగ్ కోసం బయటికి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 October 2023,12:00 pm

Rohit Sharma : ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా నిన్న పూణే స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యాకు గాయం అయిన విషయం తెలిసిందే కదా. బౌలింగ్ వేస్తుండగానే మూడు బంతులు వేసిన తర్వాత బాల్ ను కుడికాలుతో ఆపబోయి ఎడమ కాలు మీద పడటంతో ఆయన కాలు మణికట్టు కాస్త బెణికింది. దీంతో హార్దిక్ పాండ్యా కాస్త అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే పాండ్యాను స్కానింగ్ కోసం బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ మ్యాచ్ ను పాండ్యా కంటిన్యూ చేయలేకపోయాడు. మిగితా మూడు బంతులు కూడా పేసర్ విరాట్ కోహ్లీ వేశాడు. సడెన్ గా విరాట్ కోహ్లీ బౌలర్ గా మారడంతో ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ గెలుపొందడం పక్కన పెడితే.. హార్ధిక్ పాండ్యాకు ఏం జరిగింది. అంతా ఓకేనా.. నెక్స్ట్ మ్యాచ్ లకు వస్తాడా.. రాడా అని సగటు క్రికెట్ అభిమాని తెగ టెన్షన్ పడ్డాడు.

కానీ.. హార్దిక్ గాయంపై రోహిత్ శర్మ అప్ డేట్ ఇచ్చాడు. హార్దిక్ కొంచెం నొప్పితో బాధపడుతున్న విషయం నిజమే కానీ.. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. టీమిండియా అదృష్టం అది. పాండ్యాకు అంత పెద్ద గాయం కాలేదు. నెక్స్ట్ మ్యాచ్ కోసం ఎలా పాండ్యాను సిద్ధం చేయాలో బీసీసీఐ ఆలోచిస్తుంది. గాయం నేపథ్యంలో పాండ్యా తదుపరి మ్యాచ్ కోసం ఎలా ముందుకెళ్లారో చూస్తాం… అని రోహిత్ స్పష్టం చేశాడు. అంటే.. పాండ్యాకు పెద్ద గాయమేమీ కాలేదన్నమాట. అంటే వచ్చే మ్యాచ్ లో ఖచ్చితంగా పాండ్యా ఉంటాడని అనుకోవాలి.

rohit sharma about hardik pandya injury

Rohit Sharma : వరల్డ్ కప్ లో టాప్ ప్లేస్ లో టీమిండియా

మరోవైపు ఈ వరల్డ్ కప్ లో టీమిండియా టాప్ ప్లేస్ కి ఎగబాకింది. పాకిస్థాన్ తో మ్యాచ్ కంటే ముందు ఇండియా మూడో స్థానంలో ఉండేది. పాక్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత 6 పాయింట్లతో టాప్ ప్లేస్ కు వెళ్లింది. ఇప్పుడు ఏకంగా మరో 2 పాయింట్లు పెంచుకొని తన టాప్ స్థానాన్ని పదిలపరుచుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి సొంత గడ్డ మీద టీమిండియా దూకుడు మీదుంది. ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది