Rohit Sharma : నాకౌట్‌లోను కోహ్లీ ఫెయిల్‌.. అత‌డు అలా ఆడ‌డానికి ఓ కార‌ణం ఉంద‌న్న రోహిత్ శ‌ర్మ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rohit Sharma : నాకౌట్‌లోను కోహ్లీ ఫెయిల్‌.. అత‌డు అలా ఆడ‌డానికి ఓ కార‌ణం ఉంద‌న్న రోహిత్ శ‌ర్మ‌

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2024,1:00 pm

Rohit Sharma : టీ20 ప్రపంచకప్ లో టీమిండియా అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతుంది. బ్రేకుల్లేని బండిలా.. ప్రత్యర్థి ఎవరైనా సరే తొక్కేసుకుంటూ పోతుంది. ఇప్పటి వ‌రకు ఒక్క ఓటమి కూడా చెంద‌కుండా ఫైన‌ల్‌కి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్ సైడ్ మ్యాచులో భారత్ ఏకంగా 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), హార్దిక్ పాండ్యా(13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23) దుమ్మురేపగా.. ఆ తర్వాత భారత్ బౌలర్లు అక్షర్ పటేల్(3/23), కుల్దీప్ యాదవ్(3/19), బుమ్రా (2/12) రఫ్ఫాడించడంతో భారత్ భారీ విజయం సాధించింది.

Rohit Sharma కోహ్లీపై వ‌రుస విమ‌ర్శ‌లు..

అభిమానుల నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ల వరకు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం మళ్లీ విఫలమయ్యారు. ఈ టోర్నీ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. ధనాధన్ బ్యాటింగ్ చేస్తారనుకుంటే.. బొక్కబొర్లాపడుతున్నారు. ఆ ఇద్ద‌రు శివ‌మ్ దూబే, విరాట్ కోహ్లి. టీమిండియాకి మూల స్తంభ‌మైన కింగ్ ఈ మెగాటోర్నీలో వరుసగా విఫలమయ్యాడు. ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లి సింగిల్ డిజిట్‌కు పరిమితమవ్వడం ఇది ఏకంగా అయిదోసారి. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండు సార్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. 2012 నుంచి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లీ ఇలా మునుపెన్నడూ విఫలమవ్వలేదు. 2012 నుంచి 2022 వరకు అతను రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాడు.

Rohit Sharma నాకౌట్‌లోను కోహ్లీ ఫెయిల్‌ అత‌డు అలా ఆడ‌డానికి ఓ కార‌ణం ఉంద‌న్న రోహిత్ శ‌ర్మ‌

Rohit Sharma : నాకౌట్‌లోను కోహ్లీ ఫెయిల్‌.. అత‌డు అలా ఆడ‌డానికి ఓ కార‌ణం ఉంద‌న్న రోహిత్ శ‌ర్మ‌

కోహ్లీ ఇలా విఫ‌లం కావ‌డం గురించి స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. కోహ్లి నాణ్యమైన ప్లేయర్ అని, ప్రతి ఆటగాడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని మద్దతు ఇచ్చాడు. తీవ్రతతో కనిపిస్తున్నాడని, ఫైనల్‌ కోసం కోహ్లి గొప్ప ప్రదర్శన దాచి పెట్టి ఉండొచ్చని రోహిత్ అన్నాడు. ”విరాట్ కోహ్లి క్వాలిటీ ప్లేయర్. ప్రతీ ఆటగాడు ఈ దశను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని క్లాస్ ఏంటో, ప్రధాన మ్యాచ్‌ల్లో అతడు ఎంత కీలమమా మాకు తెలుసు. ఫామ్ అనేది సమస్య కాదు. 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతుంటే ఫామ్ అనేది అసలు సమస్యగా ఉండదు. తుదిపోరులో కోహ్లి తప్పక ఉంటాడు. జట్టుగా మేం ప్రశాంతతో ఉండాలి. అప్పుడు ముగింపు మ్యాచ్‌లో కూడా మేము అద్భుతంగా రాణించ‌గ‌లుగుతాం అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది